Ad Code

Responsive Advertisement

శబరిమల యాత్రికుల పాటించవలసిన నియమాలు

 శబరిమల ఆలయం మాస పూజల కోసం అక్టోబర్ 16 న సాయంత్రం 5 గంటలకు తెరుస్తారు. భక్తులను అక్టోబర్ 17 నుంచి అనుమతిస్తారు. దర్శనం కోసం భక్తులకు కొన్ని మార్గదర్శకాలు చేసారు అవి.



  • భక్తులు ముందుగానే కేరళ పోలీస్‌శాఖ అభివృద్ధి చేసిన వర్చువల్‌ క్యూ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. దీని కోసం https://sabarimalaonline.org వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • వారం ప్రారంభంలో రోజుకు 1000 మంది, వారాంతాల్లో రోజుకు 2000 మంది చొప్పున పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకునే వీలు కల్పించారు. పరిస్థితులను మార్పులు చేస్తారు.
  • దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అందులో నెగటివ్‌ వచ్చిన వారినే అనుమతిస్తారు. ప్రవేశమార్గంలోనూ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తారు.
  •  పది సంవత్సరాలలోపు వారికి, 60-65 సంవత్సరాలు దాటిన వారిని దర్శనానికి అనుమతించరు. దీర్ఘకాలిక, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు కూడా శబరిమల యాత్రకు రాకూడదు.
  • శబరిమల యాత్రకు వచ్చిన వాళ్లు తమతో ఆయుష్మాన్‌ భారత్‌, బీపీఎల్‌ తదితర ఆరోగ్యబీమా కార్డులను వెంటతెచ్చుకోవాల్సి ఉంటుంది.
  • స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బసచేయడం వంటివాటిని అనుమతించరు.
  • కేవలం ఎరుమేలి, వడసెర్రికర మార్గాల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. మిగతా అన్ని రూట్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు.

Post a Comment

0 Comments