అరుణాచలం  ప్రదక్షిణ కోసం వెళ్లే వారు ఒక్క అడుగు వేసినంత మాత్రాన్నే భూలోకాన్ని, రెండో అడుగుతో అంతరిక్షాన్ని, మూడో అడుగుతో స్వర్గాన్ని పొందుతారు.


మొదటి అడుగుతో మానసికంగా చేసిన పాపం, రెండో అడుగుతో వాక్కు ద్వారా చేసిన పాపం, మూడో అడుగుతో శరీరం ద్వారా చేసిన పాపం తొలగిపోతుంది.


  • ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో అగస్త్యమహర్షి శిష్య సమేతంగా ఈ తీర్థంలో స్నానం చేసి, ఇక్కడ స్వామిని సేవిస్తారు.
  • ప్రతి ఆశ్వయుజమాసంలో మీరు పర్వతం మీద నివసించే వశిష్ట మహర్షి ఇక్కడికి వచ్చి స్వామిని సేవించి వెళ్తారు.
  • ప్రతి మార్గశిర మాసంలో సత్యలోకం నుండి బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చి ఈ తీర్థంలో స్నానం చేసి స్వామిని అర్చించి వెళ్తాడు.
  • ప్రతి పుష్యమాసంలో ఇంద్రుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వామిని సేవిస్తాడు.
  • ప్రతి మాఘమాసంలో పరమేశ్వరుడు రుద్రగుణాలతో ఇక్కడ నిలిచి ఉంటాడు.
  • ప్రతి పాల్గుణ మాసంలో మన్మధుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వామిని సేవిస్తాడు.
  • ప్రతి వైశాఖమాసంలో వాలఖిల్యాది మహర్షులతో కలిసి సూర్యుడు, వేదాలు ఈ తీర్థంలో స్నానమాచరిస్తారు.
  • భూదేవి సకల ఔషధలతో, సకల దేవతలతో కలిసి జ్యేష్టమాసంలో ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకుంటుంది.