Ad Code

Responsive Advertisement

కార్తీక మాసంలో ఏమి తినాలి ? ఏ పనులు చేయాలి ? ఏ వ్రతాలు చేయాలి ?

కార్తిక మాసంతో సమానమైన మాసం, కృతయుగంతో సమమైన యుగం, వేదానికి సరితూగే శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవని అర్థం. శివ కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఉపవాస నిష్టలకూ, నోములకూ, వ్రతాలకూ ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రత్యేకించి శివారాధకులు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించే మాసం ఇది.



ఈ నెల రోజులూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేస్తారు. కార్తిక సోమవారాలు, కార్తిక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ప్రాతఃకాల స్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. స్నానం పూర్తయిన తరువాత దీపారాధన చెయ్యాలనీ, రావిచెట్టు, తులసి, ఉసిరిక చెట్ల దగ్గర దీపాలు పెట్టడం ఉత్తమమనీ పెద్దలు చెబుతారు. మాసాలలో అసమానమైనదిగా పేరు పొందిన కార్తిక మాసంలో ఎన్నో పర్వదినాలున్నాయి. 

పఠించదగిన స్తోత్రాలు

  • వామన స్తోత్రం, 
  • మార్కండేయకృత శివస్తోత్రం, 
  • సుబ్రహ్మణ్యాష్టకం, 
  • శ్రీ కృష్ణాష్టకం, సూర్య స్తుతి, 
  • గణేశ స్తుతి, దశావతార స్తుతి, 
  • దామోదర స్తోత్రం, అర్ధ నారీశ్వర స్తోత్రం, 
  • లింగాష్టకం, బిల్వాష్టకం,
  • శివషడక్షరీ స్తోత్రం
  • శ్రీ శివ స్తోత్రం,శివాష్టకం
  • మృత్యుంజయ మహామంత్ర జపం 
  • శ్రీ విష్ణు స్తోత్రం, శివ పంచాక్షరీ స్తోత్రం, తులసీ కవచం, తులసీ షోడశ నామావళి.


చేయదగిన వ్రతాలు

  • శ్రీ తులసీ ధాత్రీ సహిత దామోదర వ్రతం
  • ఉమా సహిత శంకర వ్రతం
  • శ్రీ శివ సోమవార వ్రతం
  • క్షీరాబ్ధి ద్వాదశీ వ్రతం, కేదారేశ్వర వ్రతం
  • శ్రీ రాధా దామోదర వ్రతం, వృషోత్సర్జనం
  • జ్వాలా తోరణం, అర్ధనారీశ్వర వ్రతం
  • కార్తికేయ వ్రతం, విష్ణు త్రిరాత్ర వ్రతం, చాతుర్మాస్య దీక్షా విరమణ, బలిపూజ.


చేయాల్సిన పూజలు

శివారాధనం, కేశవారాధనం, శక్త్యుపాసనం, గణేశార్చనం, సూర్చార్చనం, సవత్స గోపూజనం, వృషభ పూజ, అశ్వత్థ చూజ, వట పూజ, తులసి పూజ, ధాత్రీ పూజనం, గంగాది నదీపూజనం, జలస్థాన పూజనం.

ఈ నెలలో చేయదగిన పనులు

  • కార్తిక ప్రాతఃస్నానం, ఆకాశ దీపం
  • వివిధ దానాలు, సాలగ్రామ దానం, కన్యా దానం
  • కార్తిక పురాణ పఠనం, శ్రవణం 
  • ఉపవాసం, భూశయనం 
  • బ్రహ్మచర్యం 
  • శ్రీహరి కమలార్చనం 
  • వన భోజనం, తీర్థ యాత్రలు 
  • కార్తిక నిత్య దీపారాధనం, సవత్స గోదానం
  • సువర్ణ తులసీ వృక్ష దానం  
  • నక్తం (పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చెయ్యడం).


చేయకూడని పనులు

  • పర నింద, గురు నింద, 
  • పర ద్రోహం, మాదకద్రవ్య సేవనం, 
  • తైలాభ్యంగనం, వ్రతభ్రష్టులతో సంభాషణం, 
  • బహిష్ఠులతో సంభాషణం, తల్ప శయనం, 
  • పరాన్న భోజనం, ఇతరుల ఎంగిలి పదార్థాల్ని తినడం, 
  • పాచిపోయిన ఆహారం తినడం.


తినదగినవి

ధాన్యం, యవలు (బార్లీ), జొన్నలు, గోధుమలు, కంద, సముద్రపు ఉప్పు, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, పనస, మామిడి, కొబ్బరి, కరక్కాయ, పిప్పళ్ళు, జీలకర్ర, శొంఠి, ఒక విధమైన ఉసిరిక, నూనెతో చెయ్యని వంటకాలు, బెల్లం తప్ప చెరకు నుంచి వచ్చే మిగిలిన పదార్థాలు

విడిచి పెట్టాల్సినవి

ప్రాణుల శరీర భస్మం, చర్మంతో చేసిన పాత్రల్లో నీరు, నిమ్మపండు, దానిమ్మపండు, యజ్ఞ ప్రసాదం కానిది, విష్ణువుకు నైవేద్యం కాని ఆహారం, మాడిన అన్నం, మసూరములు, మాంసం- వీటికి ‘ఆమిషములు’ అని పేరు. వాటిని విడిచిపెట్టాలి. వీటితోపాటు ద్విదళ ధాన్యాలు, అవిసె, గుగ్గిళ్ళు, లవణం, ఆనపకాయ, కళింగ ఫలం, బహు బీజ ఫలాలు, నిర్బీజములైన ముల్లంగి, ఎర్ర ముల్లంగి , గుమ్మడి కాయ, చెరుకుగడ, కొత్త రేగు, ఉసిరిక, చింతకాయ, తేనె, పొట్లకాయ, వంగ, ఉల్లి, వెల్లుల్లి, తెల్ల ఆవాలు.


Post a Comment

0 Comments