Ad Code

Responsive Advertisement

కార్తీక స్నానం విశిష్టత.



  • కార్తీకంలో గోష్పాదమంతా జలంలో కూడా ఆ దేవదేవుడు ఉంటాడు అని భక్తులు విశ్వసిస్తారు.
  • ఈ మాసంలో సూర్యోదయంకి ముందుగా చేసే స్నానాని హంసోదక స్నానం అని అంటారు.

  • చంద్రకిరణాలు సోకినా నీటితో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి.
  • సూర్యోదయానికి పదినిముషాలకు ముందు స్నానం చేయడం ఉత్తమం. ఆలా చేయడం వల్ల మానసిక, శారీరిక రుగ్మతలు నశిస్తాయి.పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్షు పెరుగుతుంది.
  • స్నానం చేసిన తరువాత పొడివస్త్రంతో పూజ చేయాలి.
  • ప్రాతః కాలంలో అయిదు గంటలకు ముందు చేసే స్నానాని ఋషి స్నానం అని అంటారు, అయిదు నుండి ఆరు లోపు చేసే స్నానం దేవస్నానం, ఆరు నుండి ఏడు లోపు మానవ స్నానం, ఆ తరువాత చేసేది రాక్షస స్నానం.
  • అనారోగ్యం వల్ల కానీ మరి ఏదైనా కారణం చేత స్నానం చేయలేకపోతే  నిర్మలహృదయంతో భగవంతుని స్మరించడం మానస స్నానం అవుతుంది.
  • ఎండ, వాన కలిసినప్పుడు చేసే స్నానాని దివ్య స్నానం అని అంటారు.
  • గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ చేసే స్నానాని గాయత్రీ స్నానం అవుతుంది.దీని వల్ల సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి.
  • కార్తీకపౌర్ణమి నాడు సముద్ర స్నానం చేస్తే మంచిది.


Post a Comment

0 Comments