Ad Code

Responsive Advertisement

వైకుంఠ చతుర్దశి

కార్తీక మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్దశి ని వైకుంఠ చతుర్దశి అని అంటారు. ఈ రోజు విష్ణువుని, శివుడిని పూజిస్తారు.



వైకుంఠ చతుర్దశిరోజు శివుడికి బిల్వార్చన చేసినా, విష్ణుమూర్తికి తులసీమాల వేసినా...అశ్వమేధాది యాగాలు చేసినంత ఫలమని చెబుతారు. హరిహర నామస్మరణతో జాగరణ చేస్తే కైవల్య ప్రాప్తి తథ్యమని పురాణ ప్రస్తావన. మహావిష్ణువు అంతటివాడు కూడా, వైకుంఠ చతుర్దశి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటాడట.

ఒక సారి విష్ణుభగవానుడు వైకుంఠం విడిచి కాశీ కి  విశ్వనాథుడు ని దర్శించడానికి వస్తాడు. 1000 తామర పువ్వులతో శివుడిని పూజిస్తాడు , శివుడి కీర్తనలు పాడతాడు ఈ లోపు ఒక తామర పుష్పం కనపడకుండా పోతుంది , విష్ణు కళ్ళు ను తామర  పువ్వులతో పోలుస్తారు కనుక ఒక కన్నును శివుడికి అర్పిస్తాడు, విష్ణు భక్తికి మెచ్చిన శివుడు కన్ను ఇవ్వడమే కాకా సుదర్శన చక్రాన్ని కూడా బహుమతిగా ఇస్తాడు.

మరో ఒక పురాణం కధనం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు అనేక పాపాలు చేసి, పాపాలు ప్రక్షాళన చేసుకోడానికి గోదావరి నది లో మునుగుతాడు. ఆ రోజు వైకుంఠ చతుర్దశి భక్తులు అందరు నది తీరంలో దీపాలు వెలిగిస్తారు, ఆ జన సమూహంలో ధనేశ్వర్ కలిసిపోతాడు.ధనేశ్వర్ మరణం తరువాత యమా భటులు నరకానికి తీసుకువెళ్తారు, అప్పుడు శివుడు వైకుంఠ చతుర్దశి రోజు భక్తులు దీపాలు వెలిగించడానికి వచ్చిన అప్పుడు వాళ్ళ స్పర్శ తాకడం వాళ్ళ పాపాలు నశించాయి అని  ధనేశ్వర్ ని వైకుంఠానికి పంపుతాడు.

కార్తికం దీపాల మాసం. నెలంతా శివకేశవుల ఆలయాల్లో దీపోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. అందులోనూ వైకుంఠ చతుర్దశి నాడు ఇత్తడి లేదా రాగి కుందుల్లో దీపాల్ని వెలిగించి దానంగా ఇవ్వాలంటారు. సకల దానాల్లోనూ దీపదానం మహోన్నతమైంది. దీనివల్ల, సమస్త దోషాలూ సకల పాపాలూ తొలగిపోతాయని అంటారు. దీపాలు చీకట్లను పారదోలినట్టే, దానఫలం మనలోని అజ్ఞానాన్నీ అహంకారాన్నీ తరిమి వేస్తుందని నమ్మకం. చతుర్దశినాడు..సూర్యోదయానికి ముందే నిద్రలేచి, నదీస్నానం ఆచరించి...శివకేశవుల ఆలయాల్ని సందర్శిస్తారు. నమకచమకాల్నీ విష్ణుసహస్రనామాల్నీ పఠిస్తారు. స్తోమత మేర దానధర్మాలు చేస్తారు. ఆ పుణ్యఫలాలే భౌతికశరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిననాడు...నేరుగా వైకుంఠ ద్వారాలు తెరిపిస్తాయని నమ్మకం.




కొని ప్రాంతాలలో ఈ రోజు కార్తీక స్నానం చేస్తారు.రిషికేష్ లో విష్ణు నాలుగు నెలలు తరువాత యోగ నిద్ర లేచిన సందర్భంగా దీపధన్ మహోత్సవం చేస్తారు. పవిత్ర గంగ నది తీరం లో దీపాలు వెలిగిస్తారు.గ్రిశ్నేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయం లో విష్ణుకి బిల్వ పత్రాలతో, శివుడికి తులసి తో పూజలు చేస్తారు. కాశి విశ్వనాధుని ఆలయంలో విష్ణుకి ప్రతేక్య పూజలు నిర్వహిస్తారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో, శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో, ఉడుపి కృష్ణమఠంలో వైకుంఠ చతుర్దశి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు.

2020  తేదీ : 28 నవంబర్

Post a Comment

0 Comments