Ad Code

Responsive Advertisement

ఉసిరికాయ ప్రాశస్త్యం (పద్మ పురాణం)

ఉసిరికాయనే ధాత్రీ ఫలం అంటారు. ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ఈ కాయకి ఎంతో ప్రాధాన్యం ఇవ్వబడింది.



  • ఉసిరిపండు ఎంతో పవిత్రమైనదిగా ముల్లోకాల్లో కీర్తించబడింది
  • ఉసిరిమొక్కల్ని నాటితే భవబంధాలు దూరమౌతాయి.
  • ఉసిరికాయని తింటే ఆయుర్దాయం పెరుగుతుంది
  • ఉసిరిరసంతో స్నానం చేస్తే దరిద్రం తొలగిపోతుంది
  • ఉసిరిచెట్టు ఉన్న ఇంట ఐశ్వర్యం తాండవిస్తుంది
  • ఈ చెట్టు ఉన్న ఇంట్లో దుష్టగ్రహపీడల వుండదు.
  • శుక్ల లేక కృష్ణ పక్షంలోగానీ ఏకాదశి నాడుగానీ ఉసిరి ఆకుల్ని నీళల్లో వేసి లేదా ఉసిరిరసాన్ని కలుపుకుని గానీ స్నానం చేస్తే పాపాలన్నీ క్షీణిస్తాయి.
  • నిత్యం ఉసిరి రసంతో తలకి స్నానం చేస్తే కేశాలు నల్లగా ఏపుగా పెరుగుతాయి
  • ఉసిరిరసం నియమంగా సేవించిన వారికి పునర్జన్మ ఉండదు
  • ధాత్రీ వృక్షాన్ని(ఉసిరి) చూసినా తాకినా ఆ వృక్ష నామాన్ని స్మరించినా శ్రీహరి ప్రీతి చెందుతాడు.
  • ఉసిరి చెట్టు ఉన్న స్థలంలో లక్ష్మీనారాయణులు, బ్రహ్మ సరస్వతులు నివసిస్తారు.


వివిధ రకాల యజ్ఞయాగాల్లో సకలదేవతల పూజలో ఉసిరిఫలాన్ని వినియోగిస్తారు. అయితే కేవలం సూర్యుడి పూజలో మాత్రమే ఉసిరి ఫలాన్ని వినియోగించరు. అందుకే సూర్యవారమైన ఆదివారం, అలాగే సప్తమీ తిథినాడు ఉసిరికాయని తాకకూడదు, స్వీకరించకూడదు

Post a Comment

0 Comments