Ad Code

Responsive Advertisement

మండల కాలం - శబరిమల

ప్రఖ్యాత శబరిమల ఆలయంలో "మండల కాలం" మలయాళ మాస "వ్రిశ్చికం" మొదటి రోజు మొదలై "ధను" మాసం లో 11 వ రోజు ముగుస్తుంది. ఈ 41 రోజుల సమయాన్ని మండల కాలం అని అంటారు.



ఈ 41  రోజులలో దేశనలుమూలల  నుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఈ 41 రోజుల  తరువాత ఆలయాన్ని మూడు రోజులు మూసివేస్తారు. మళ్ళీ నాలుగో రోజు స్వామి వారు దర్శనమిస్తారు.

సాధారణంగా నవంబర్ నెల మధ్యలో నుంచి స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు ఇలాగే జనవరి నెల మధ్య వరకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. జనవరి నెలలో 'మకరవిలక్కు' తో మళ్ళీ ఆలయం మూసివేస్తారు.

ఎంతో నిమయ నిష్టలతో అయ్యప్ప మాల  ధరించినవారు ఈ కాలంలో స్వామివారిని దర్శించుకుంటారు.
పవిత్రమైన "ఇరుముడి" ని స్వామి వారికీ సమర్పించుకుంటారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం 10 - 50  వయసు మధ్య ఆడవారు స్వామి వారిని దర్శించకూడదు.
ఈ మండల కాలంలోనే గురువాయూరులోని శ్రీ కృష్ణ భగవానుడిని దర్శించుకునే ఆచారం కూడా వుంది.

మండల కాలం ప్రారంభం  : 16 నవంబర్ 2020.

Post a Comment

0 Comments