Ad Code

Responsive Advertisement

శ్రావణ సోమవారం వ్రతం


  • శ్రావణమాసంలో వచ్చే సోమవారాలు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి.
  • శ్రావణమాసంలో ఆచరించాల్సిన వ్రతాలలో సోమవారం వ్రతం ఎంతో విశేషమైనది.
  • ఈ రోజున శివుని ప్రీతర్థ్యం ఉపవాసం లేదా నక్తవ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
  • సోమవార వ్రతంలో పగలు ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో అంటే సాయంకాలాన శివుని శక్తికొలది అభిషేకించి అర్చించాలి.
  • ఈ వ్రతంలో ఉపవాసం ఉండ గలిగిన వారు నిరాహారంగా వుండవచ్చు. ఉండలేనివారు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజానంతరం భుజించవచ్చు.
  • ఈ రోజు విధివిధానంగా శివుని అర్చించాలేని వారు, కనీసం శివాలయానికి వెళ్లి పరమేశ్వరుని దర్శించాలి.

కొత్తగా పెళ్లయిన దంపతులు శివాష్టకం వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం గురించి శివధర్మోత్తర పురాణంలో ఉంది. రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసం చేస్తున్న పాండవులు కేదార క్షేత్రానికి చేరుకుంటారు. ఆనాడు శ్రావణ సోమవారం. కేదారనాథుణ్ణి అర్చించిన ద్రౌపది అక్కడ లభించే ధాన్యాన్ని ఐదు పిడికిళ్లతో లింగంపై ఉంచింది. ఫలితంగా పాండవులు కోల్పోయిన రాజ్యం తిరిగి పొందగలిగారని ప్రతీతి. ఈ వ్రతాన్ని ఐదు సంవత్సాల పాటు చెయ్యాలి. మొదటి సంవత్సరం బియ్యం, రెండవ సంవత్సరం నువ్వులు, మూడో సంవత్సరం గోధుమలు, నాలుగో సంవత్సరం శనగలు, ఐదో సంవత్సరం మినుములు స్వామికి సమర్పించాలి. అనంతరం ఉద్యాపన చెయ్యాలి .

2022 తేదీలు : ఆగష్టు 01, 08, 15, 22.

Post a Comment

0 Comments