Ad Code

Responsive Advertisement

ఆగస్టు 16 నుండి 20వ తేదీ వరకు నెల్లూరులో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు



కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తోంది. కరోనా కారణంగా రెండున్నర ఏళ్ల విరామం తరువాత నెల్లూరు నగరం నుంచి ఈ ఉత్సవాలను టిటిడి పునఃప్రారంభించనుంది. నెల్లూరులోని ఎసి.సుబ్బారెడ్డి స్టేడియంలో ఆగస్టు 16 నుండి 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల్లో రోజువారీ కార్యక్రమాల సరళి ఇలా ఉంటుంది.


నిత్య కైంకర్యాలు

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర, ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ప్రత్యేక సేవ, ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు రెండో నివేదన చేపడతారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంతసేవ నిర్వహిస్తారు.


ప్రత్యేక సేవలు

ప్రత్యేక సేవల్లో భాగంగా ఆగస్టు 16న అష్టదళ పాదపద్మారాధన, వసంతోత్సవం, ఆగస్టు 17న సహస్రకలశాభిషేకం, ఆగస్టు 18న తిరుప్పావడ, ఆగస్టు 19న అభిషేకం, ఆగస్టు 20న ఉదయం పుష్పయాగం, సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

Post a Comment

0 Comments