Ad Code

Responsive Advertisement

పురాణాలలో చెప్పిన నిద్ర నియమాలు

 

మన హిందూ స్మృతులు, పురాణాలలో చెప్పిన శయన నియమాలు 


  • నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు.( మనుస్మృతి)
  • పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు. ( విష్ణుస్మృతి)
  • విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,వీరిని మేల్కొలపవచ్చును.( చాణక్య నీతి)
  • ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి.( దేవీ భాగవతము)
  • పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.( పద్మ పురాణము)
  • తడి పాదము లతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది.( అత్రి స్మృతి) 
  • విరిగిన పడకపై,ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం.( మహాభారతం)
  • నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు.( గౌతమ ధర్మ సూత్రం)
  • తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య,పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత,ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని,మృత్యువు,ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించిన చో ధనము,ఆయువు ప్రాప్తిస్తుంది.
  • పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో 1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది)
  • పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.( బ్రహ్మా వైవర్తపురాణం)
  • సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే పడుకోవాలి
  • ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.
  • పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.
  • పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది.)

Post a Comment

0 Comments