- శ్రావణ పూర్ణిమ నాడు రక్షాబంధనాన్ని ఆచరిస్తారు.
- ఈ రక్షాబంధన ప్రస్తావన భవిష్యోత్తర పురాణంలో వుంది
- ఈ రోజు పూజలో రక్షను పెట్టి, పూజింప జేసి, పురోహితునితో కుడిచేతి మణికట్టుకు కట్టించు కోవాలి.
- ఈ రక్షను కట్టించుకోవడం వల్ల సంవత్సర మంతా దుష్ట భూత, ప్రేత, పిశాచాలు కరువు. ఇంకా రోగాలు, అశుభాలనుండి రక్షను పొందవచ్చు.
- శ్రావణ పౌర్ణమి రోజున అక్కాతమ్ముళ్ళ, అన్నా చెల్లెళ్ళ ఆప్యాయతకు నిదర్శనంగా నిలిచే రాఖీ కట్టే సంప్రదాయం కారణంగా ఈ పౌర్ణమి రాఖీ" పౌర్ణమి కూడా ప్రసిద్ధమైంది.
- ఈ రోజు - అక్కలు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అన్నలకు రాఖీలు కడతారు.
- ఈ రాఖీ కుడిచేతి మణికట్టుకు కట్టడం సంప్రదాయం
- క్రమంగా స్త్రీలు పరాయి పురుషులను సోదరులుగా భావించి రాఖీ కట్టే సంప్రదాయం కూడా ప్రాచుర్యాన్ని పొందింది.
- ఈ రాఖీ కట్టడంలో పురుషులు స్త్రీలకు రక్షణగా వుండాలనే పరమార్థం యిమిడి వుంది.
2022 తేదీ : ఆగష్టు 11/12
0 Comments