- వైశాఖ బహుళ ఏకాదశికి అపర ఏకాదశి అనే పేరు.
- ఈ రోజు వామనుని పూజించాలి.
- ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపచేస్తుంది.
- బ్రాహ్మణ హత్య, గోహత్య, పరనింద, అక్రమ సంబంధం, అసత్యవాదం, తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం, డబ్బు కొరకు వేదాలు పఠించడం వంటి ఘోరమైన పాపాలు ఈ ఏకాదశివ్రతంతో నశించిపోతాయి.
- గురుధూషణ చేసిన వారు, యుద్ధం నుండి పారిపోయిన క్షత్రియుడు ఈ ఏకాదశి వల్ల పాపవిముక్తుల అవుతారు.
కార్తీక మాసంలో పుష్కరతీర్థంలో ముమ్మార్లు స్నానం చేసిన ఫలితం, పుష్యమాసంలో సూర్యుడు మకరసంక్రమణ చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితం, కాశీలో శివరాత్రివ్రతాన్ని పాటించిన ఫలితం, గయలో విష్ణుపాదాల చెంత పిండప్రదానం చేసిన ఫలితం, గురువు సింహరాశిలో ప్రవేశించినపుడు గౌతమీనదిలో స్నానమాడిన ఫలితం, కుంభమేళా సమయంలో కేదారనాధక్షేత్ర దర్శనఫలం, బద్రీనాథ్ క్షేత్ర దర్శనపూజాఫలం, కురుక్షేత్రంలో స్నానఫలం, ఏనుగులు, గుర్రములు, గోవులు సువర్ణం, భూమి వాటిని దానమిచ్చిన ఫలితం ఈ ఏకాదశి వ్రతం వల్ల లభిస్తుంది.
ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు,చదివేవాడు సర్వపాపవిముక్తుడు అవుతాడు.
2021 : జూన్ 06.
2021 : జూన్ 06.
0 Comments