Ad Code

Responsive Advertisement

కామిక ఏకాదశి



  • ఆషాడ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు
  • ఈ ఏకాదశి మనసులోని కోరికలను  సిద్దిపచేస్తుంది.
  • ఈ రోజు విష్ణుభగవానుడిని ఆరాధించి , తులసి దళాలతో పూజలు చేస్తారు.
  • గంగాతీరం, కాశీ, నైమిశారణ్యం, పుష్కరం వంటి తీర్థస్నానలోని వసించి అక్కడ స్నానం చేయడం వల్ల కలిగే ఫలితం కేవలం ఈ రోజు విష్ణు ఆరాధనతో లభిస్తుంది.
  • కేదారనాథ్ లో , కురుక్షేత్రంలో లేదా సూర్యగ్రహణం రోజు చేసే స్నానం వలన లభించినట్టు ఫలితం ఈ రోజు శ్రీకృష్ణుని ఆరాధన వల్ల లభిస్తుంది.
  • ఈ రోజు తులసీదేవికి నమస్కరించి నెయ్యతో దీపారాధన చేసేవాని పుణ్యాన్ని చిత్రగుప్తుడైన లెక్కించలేదు.
  • ఈ రోజు తులసి దర్శనం సర్వపాపహరం.
  • తులసికి స్నానం చేయించడం ద్వారా మనిషికి యమధర్మరాజు భయం పోతుంది.
  • బ్రహ్మహత్యా లేదా భృణహత్య వంటి ఘోరమైన పాపాలు ఈ వ్రతం ఆచరించటం వల్ల నశిస్తాయి.
  • ఈ రోజు ఉపవసించడం వల్ల సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేయడంతో సమానం అని చెప్తారు.
  • ఈ రోజు రాత్రి జాగరణం చేసిన వారు మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షం పొందుతారు అని విష్ణుమూర్తి, నారద మహామునితో చెప్పినట్లు పురాణం కధనం.
  • ఈ ఏకాదశి మహిమను వినేవాడు లేదా చదివాడు నిశ్చయంగా విష్ణులోకానికి చేరుకుంటాడు.


2021 : ఆగష్టు 4. 

Post a Comment

0 Comments