హరితాళికా వ్రతం || Hartalika Vratam
- భాద్రపద శుద్ధ తదియనాడు ఆచరించే ఈ వ్రతానికే స్వర్ణగౌరీ వ్రతం అని పేరు.
- దీనికే ఉమాపూజ, గౌరీపూజ, గౌరీతృతీయ అనే పేర్లు కూడా వున్నాయి.
- ఈ వ్రతాన్ని స్వయంగా పరమేశ్వరుడే,పార్వతి దేవికి ఉపదేశించారని పురాణాల ద్వారా తెలుస్తుంది.
- ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఈ వ్రతం ఆచరణలో వుంది.
- స్త్రీలు దీర్ఘాయువు కొరకు సౌభాగ్యం కోసం, ఆచరించే ఈ వ్రతవిధానాన్ని ధర్మసింధువు, స్మృతికౌస్తుభం చెబుతున్నాయి
- ఈ వ్రతంలో శివలింగాన్ని, పార్వతీదేవి విగ్రహాన్ని స్థాపన చేసి విధివిధానంగా పూజించాలి.
- ఈ రోజు ఉండగలిగినవారు ఉపవాసం వుండవచ్చు.
- ఆనాటి రాత్రికి ముత్తైదువులకు తాంబూలం యివ్వాలి. తాంబూలంలో ఖర్జూరాలను వుంచడం తప్పనిసరి.
- తరువాత రోజు తిరిగి శివపార్వతులను పూజించి పులగాన్ని నివేదించాలి.
0 Comments