శ్రీకృష్ణాష్టమి రోజు రాత్రి తోమాలసేవ అనంతరం బంగారు వాకిలి వద్ద శ్రీకృష్ణస్వామికి తిరుమంజనం జరుగుతుంది.
అదే సమయంలో మరొక పీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తిని వేంచేపు చేసి ద్వాదశ తిరువారాధన చేస్తారు.
ఈ అభిషేకాలు ఏకాంతంగా జరుగుతాయి.
ఉగ్ర శ్రీనివాసమూర్తి అనందనిలయం లోకి వేంచేపు చెయ్యగా శ్రీకృష్ణస్వామికి ఆస్థానం జరుగుతుంది.
శయనించిన బాలకృష్ణుని రూపంలోవున్న స్వామికి నివేదనలు జరుగుతాయి.
శ్రీమద్భాగవతంలోని శ్రీకృష్ణావతార ఘట్టం పురాణపఠనం జరుగుతుంది. హారతితో ఆస్థానం పూర్తి అవుతుంది.
తరువాత రోజు తెల్లవారుజామున బాలకృష్ణుని ఊరేగిస్తూ బాలకృష్ణునికి తైల కాపు చేసిన నూనెను భక్తులకు పంచుతారు. భక్తులు ఆ నూనెను తలలకు అంటుకొని మంగళస్నానాలు చేస్తారు.
ఆ రోజు మధ్యాహ్నం శ్రీ మలయప్ప స్వామి తో పాటు మరొక పల్లకిలో శ్రీకృష్ణ భగవానుడు తిరుమల విధులలో ఊరేగుతుండగా ఉట్ల ఉత్సవం జరుగుతుంది.
శ్రీవారు ఆలయంలో ప్రవేశించడంతో కృష్ణాష్టమి వేడుకలు ముగుస్తాయి.
0 Comments