Ad Code

Responsive Advertisement

మథుర క్షేత్ర మహత్యం (వరాహ పురాణం)


  • జగన్నాథుడైన శ్రీకృష్ణ పరమాత్మకి మధురానగరం కన్నా ప్రియమైన లోకం ముల్లోకాలలో మరేదీ లేదు. 
  • ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ యయాతి వంశంలో అవతరించాడు.
  • శ్రీకృష్ణుడు గుప్తరూపంలో ఇక్కడ శాశ్వతంగా నివాసం ఉంటాడు.
  • ఈ దివ్య నగరంలోనే శ్రీకృష్ణుడు అవతరించాడు అందుకే ఆ నగరం పుష్కర, ప్రయాగ, కాశీ, ఉజ్జయినీ, నైమిశారణ్య క్షేత్రాలకన్నా గొప్పది. 
  • మథుర నగరంలో నివసించే మానవులు నిస్సందేహంగా ముక్తిని పొందుతారు.
  • మాఘమాసంలో వచ్చే పర్వదినాల్లో ప్రయాగక్షేత్రంలో ఉంటే ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందో అలాంటి పుణ్యఫలం మథురలో ఒక్కరోజు ఉంటేనే చాలు లభిస్తుంది 
  • వారణాసిలో ఒకవెయ్యి సంవత్సరాలు నివసిస్తే ఎలాంటి ఫలం లభిస్తుందో అంతే ఫలం మథురలో ఒక్క క్షణం నివసించినా లభిస్తుంది.
  • కార్తీకమాసంలో పుష్కర క్షేత్రంలో నివసిస్తే వచ్చే ఫలం, మధురలో నివసించేవారికి సహజంగానే లభిస్తుంది.
  • ఎవరైనా మథుర అనే పేరుని ఉచ్చరించినా లేక మధుర అనే శబ్దాన్ని విన్నా చాలు వారు అన్ని పాపాల నుంచీ ముక్తిని పొందుతారు. 
  • ఇక్కడ యమునా నది ఎంతో అందంగా ప్రవహిస్తూ ఉంటుంది.ఈ నదిలో కృష్ణుడుకి  సంబంధించిన ఎన్నో తీర్థాలు గుప్తంగా ఉన్నాయి. 
  • ఇక్కడ స్నానం ఆచరించిన వారు పుణ్య లోకాలు చేరుకుంటారు, ఇక్కడ ప్రాణం వదిలినవాళ్లు విష్ణులోకానికి చేరుకుంటారు.
  • మధురలో ఉన్న అన్ని తీర్థాల్లోకీ ఎంతో విశిష్టమైన 'సూర్య తీర్థం అది సకల పాపాల్నీ పోగొడుతుంది. ఆ తీర్థం దగ్గరే పూర్వం విరోచనుడి కుమారుడైన బలిచక్రవర్తి సూర్యుణ్ణి ఉపాసించాడు. 
  • ఆదివారంనాడు, సూర్యగ్రహణం సంభవించినప్పుడు సూర్య తీర్థంలో స్నానం చేస్తే రాజసూయ యాగం చేసిన ఫలితం లభిస్తుంది.
  • పూర్వం ధ్రువుడు కూడా ఇక్కడే తపస్సుచేసి ధ్రువలోకాన్ని పొందాడు. అతడి పేరుతో మధురలో ధ్రువతీర్థం ఏర్పడింది. ఈ తీర్థంలో స్నానం చేసినవారు సకల శుభాలు పొందుతారు.
  • ఈ ధ్రువ తీర్థానికి సమీపంలోనే తీర్థరాజం అనే ఒక తీర్థం వుంది. దానికి పడమర భాగంలో కోటి తీర్థం నెలకొంది.
  • పితృదేవతల అనుగ్రహాన్ని పొందాలనుకునేవారు కోటితీర్థం లో స్నానం చేసి పితృ దేవతల్ని అర్చించాలి ఆ తీర్థంలో పవిత్రంగా స్నానం చేసినవాడు బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు.
  • మధురా నగరంలోనే పితృదేవతల అనుగ్రహాన్ని సంపూర్ణంగా అందించే  వాయుతీర్థం వున్నది.ఇక్కడ పిండ ప్రదానం చేసినవాడు పితృలోకాన్ని చేరుకుంటాడు. 
  • గయలో పిండప్రదానం చేస్తే ఎంత గొప్ప ఫలం అదే ఫలితం మధురలో వున్న ఈ వాయు తీర్థంలో, జ్యేష్ఠ మాసంలో చేస్తే లభిస్తుంది. 

Post a Comment

0 Comments