Ad Code

Responsive Advertisement

శ్రీ కూర్మం ఆలయ విశేషాలు

  • శ్రీ కూర్మంలో కూర్మనాథ స్వామి పశ్చిమాభిముఖంగా కొలువై ఉన్నాడు.
  • స్వామివారు వేంచేసి ఉన్న గర్భాలయం మీద నిర్మించిన విమానాన్ని శ్రీ కుర్మా విమానం అని పిలుస్తారు.
  • నరసింహ, కపీశ , హయగ్రీవ విగ్రహాలతో అష్టదళ పద్మాకారంగా నిర్మించిన ఈ విమానాన్ని గాంధర్వ విమానమని కపిల సంహిత పేర్కొంది. 
  • ఈ ఆలయం చాల అరుదైనది.
  • ఎత్తైన వేదిక మీద  స్వామి వారి మూలా విరాట్ వీపు  భాగం, తల, తోక భాగం ఇలా భాగాలుగా దర్శనమిస్తారు.
  • శని , ఆదివారాలలో స్వామివారిని విశేషంగా అలంకరిస్తారు.
  • ప్రతి రోజు స్వామివారికి చందనం సమర్పిస్తారు.
  • వైశాఖ మాసంలో మాత్రం తులసీదళాలతో అర్చించడం ఆనవాయితీ.
  • స్వామివారికి అభిషేకం చేస్తే వాస్తుదోషాలు పోతాయని భక్తుల విశ్వాసం.
  • ఇక్కడా పితృదేవతలకు పిండప్రదానం చేస్తే ముక్తి లభిస్తుంది అని స్థల పురాణం చెబుతోంది.
  • ఈ క్షేత్ర పాలకుడు పాతాళ సిద్దేశ్వరుడు.
  • దక్షిణ దిక్కున ఆలయ ప్రవేశం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం.
  • వైశాఖ పూర్ణిమనాడు కుర్మజయంతిని నిర్వహిస్తారు 
  • పాల్గుణ మాసంలో శుద్ధ త్రయోదశి ఉత్తర నక్షత్రంనాడు స్వామికి డోలోత్సవం జరుగుతుంది .

Post a Comment

0 Comments