చతుర్విధ దానాలు అంటే ఏమిటి ?
- గోదానం, భూదానం, హిరణ్యదానం, తిలదానం ఈ నాలుగు దానాలను కలిపి చతుర్విధ దానాలు అని అంటారు.
- గోదానం అంటే దూడతో సహా అవును దానం చేయడం, దీనిని వల్ల ఇంద్రియాల పై విజయం చేకూరుతుంది.
- హిరణ్య దానం అంటే బంగారం దానం చేయడం, దీనిని వల్ల బ్రహ్మలోకం లభిస్తుంది.
- తిలదానం అంటే నువ్వులను దానం చేయడం, శనిదోషం ఉన్న వారు సాధారణంగా నువ్వులను దానం చేస్తారు.
- భూదానం అంటే జీవనోపాధికి తగినట్లు భూమిని దానం చేయడం, దీని వల్ల ఇచ్చేవారు, పుచ్చుకునేవారు ఇద్దరు పుణ్యలోకాలు పొందుతారు.
- ఇహపరసుఖాల కోసం చతుర్విధ దానాలు చేయడం మంచిది.
0 Comments