Ad Code

Responsive Advertisement

తిరుమల శ్రీవారి భక్తుల కోసం యాప్

తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు ఆలయానికి సంబంధించిన పూర్తి సమచారాన్ని తెలుసుకోవడం సాధారణమైన విషయం. రూమ్‌లు, దర్శనం టికెట్లు, దర్శన సమయాల్లో మార్పులు చేర్పులు ఇలా ఎంతో సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు భక్తులు ఈ సమాచారం తెలుసుకోవడానికి టీడీడీ అధికారిక వెబ్‌సైట్‌ను ఆశ్రయించే వారు. కానీ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇందుకోసం ఓ యాప్‌ను తీసుకొస్తున్నారు. భక్తుల కోసం సమస్త సమాచారాన్ని అందించే విధంగా ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే గోవింద పేరుతో ఓ యాప్‌ అందుబాటులో ఉన్నా. ఇందులో పూర్తి సమాచారం అందుబాటులో లేదు.


ఈ ఉద్దేశంతో టీటీడీ తాజాగా కొత్త యాప్‌ను తీసుకొస్తోంది ఐటీ విభాగం. ఇప్పటికే యాప్‌‌ దాదాపు పూర్తికాగా.. త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. టీటీడీ తీసుకొస్తున్న ఈ యాప్‌ ద్వారా పూర్తి సమచారాన్ని పొందొచ్చు. ఇదిలా ఉంటే భక్తులు ప్రస్తుతం దర్శనం, రూమ్‌ బుకింగ్ వంటివి టీటీడీ వెబ్‌సైట్‌లో చేసుకుంటున్నారు. కానీ ఈ యాప్‌ అందుబాటులోకి వస్తే ఇకపై దర్శనం, గదులు, శ్రీవారిసేవా టికెట్లను యాప్‌లోనే బుక్ చేసుకోవచ్చు. అలాగే సేవలు జరిగే సమయంలో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు.

Post a Comment

0 Comments