పందళం అయ్యప్ప స్వామి ఆలయం తొత్తక్కోణం, మూలంపూజ అనే గ్రామాల మధ్య ఉంది ఈ ఆలయం. ఇక్కడ స్వామి వారి ఆలయం ప్రకృతి సౌందర్యంతో అలరారుతుంది.
భక్తులను దుఃఖం నుండి బాధల నుండి కలియుగం వెలసిన దేవుడు అయ్యప్ప స్వామి.
అయ్యప్ప స్వామిని ధర్మశాస్త , మణికంఠ , భూతానాథన్, పందాల రాజా , పంబ వాసన్ అనే పేర్లుతో కూడా పిలుస్తారు. శివుడు మరియు విష్ణువు (మోహిని అవతారం) శక్తీతో అయ్యప్ప స్వామి జన్మించారు. అయ్యప్ప స్వామి అవతారానికి ముఖ్య కారణం మహిషి అనే రాక్షషి ని వాదించడమే.
శబరిమల ఆలయం కూడా ఒకప్పుడు పండలం వంశ పాలనలో ఉండేది. తరువాత ట్రావంకోర్ పరిధిలోకి వచ్చింది శబరిమల ఆలయం.
గాలవముని కుమార్తె అయిన లీలా, తన భర్త దతన్ యొక్క శాపంతో, మహీషిగా పునర్జన్మించబడింది.ఆమె ఒక గేదె ముఖంతో "అసుర" రూపంలో ఉంది. అయ్యప్ప స్వామి ఆమెను చంపినా తరువాత, ఆమె శాపం రద్దయి అందమైన స్త్రీ గా శవం నుంచి లేచి అయ్యప్పను పెళ్ళాడమని కోరింది, తాను బ్రహ్మచారి అని ఆమె కోరిక నెరవేరదు అని అయ్యప్ప స్వామి చెప్పాడు.
అయ్యప్ప స్వామి స్వయంగా ఎరుమిలి దగ్గర వావుర్ కోసం మసీద్ నిర్మించమని పందాల రాజు ను కోరాడు, అక్కడ అయ్యప్ప స్వామికి పూజలు ఒక ముస్లిం చేత జరపబడుతున్నాయి.
ఆలయ వేళలు : ఉదయం 4 నుండి రాత్రి 11 వరకు, పండుగ వేళలో మార్పులు ఉండవచ్చు.
10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలకు ఈ ఆలయం లోనికి అనుమతించారు.
ముఖ్యమైన పండుగలు :
మకర విళక్కు : మకర జ్యోతి దర్శనం అత్యంత వైభవంగా జరిగే పండుగ.
ఓనం
విషు
పూజలు మరియు అలయ ఆచారాలు :
- మండలకాలాం 41 రోజులు విశేషమైన పూజలు చేస్తారు. వ్రిశ్చికం మాసంలో మొదటి శనివారం అయ్యప్పన్ విళక్కు నిర్వహిస్తారు.
- ఉదయానే స్వామి ని నిద్ర లేపిన తరువాత, నిన్న అలంకరించిన పూలతో స్వామి వారు దర్శనం ఇస్తారు.దీనినే నిర్మలాయ దర్శనం అని అంటారు.రాత్రి పూట దేవతలు వచ్చి స్వామిని దర్శించి వెళతారు.
- ముందు రోజు అలంకరించిన ఆభరణాలు తీసివేసి, స్వామివారికి నీళ్లతో అభిషేకం చేస్తారు , దాని తరువాత ప్రభాత పూజ నిర్వహిస్తారు.
- పాంథీరది పూజ 'సాధారణ ఎత్తు ఉన్న వ్యక్తి నీడ 12 అడుగుల పొడవుగా పడుతుంది . ఈ పూజను అలయ ప్రధాన పూజారి నిర్వహిస్తారు.
- సాయంత్రం వేళలో దీపారాధన మరో ముఖ్యమైన పూజ, రాత్రి "అతజ" పూజ నిర్వహించిన తరువాత, నైవేద్యం సమర్పిస్తారు.
- రాత్రి "హరివారసనం" తో స్వామి వారికీ ఏకాంత సేవ నిర్వహిస్తారు.
ఎలా వేలాలి :
పందళం నుంచి తిరువనంతపురం విమానాశ్రయం 101 కిలోమీటర్లు, కోచి విమానాశ్రయం 127 కిలోమీటర్లు. అక్కడ నుండి టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
పందళం నుంచి చెంగన్నూర్ రైల్వే స్టేషన్ 14 కిలోమీటర్లు.
బస్సులు అని ప్రాంతాల నుంచి అందుబాటులో ఉన్నాయి.
పరిసర ప్రాంతాలలో ఉన్న ఆలయాలు :
పందళం మహాదేవ ఆలయం
పందళం వాలియా కోయిక్కల్ ధర్మస్త ఆలయం
పడనీలం ఆలయం
ఒరిపిరాతు భగవతి ఆలయం
0 Comments