Ad Code

Responsive Advertisement

భీష్మ ఏకాదశి

మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు.భీష్మ పితామహుని వల్లనే లోకానికి విష్ణు సహస్రనామాలు అందాయి.



భీష్ముడు ఎవరు ?

గంగా, శంతనుల అష్టమ పుత్రుడు. ఇతని అసలు పేరు "దేవవ్రతుడు''. వార్ధక్యదశలో శంతనుడు, సత్యవతి సౌందర్యానికి దాసుడై, మన్మథవశవర్తియై, విరహవేదనతో వ్యాకుల శయ్యాగతుడైతే, ఈ సంగతి తెలిసిన "దేవవ్రతుడు'' తన తండ్రి ఆనందం కోసం, సుఖసంతోషాల కోసం, స్వసుఖాలను, జీవన మాధుర్యాన్ని తృణప్రాయంగా త్యజించి, "నా జీవితంలో వనితకు, వివాహానికి తావులేదు'' అని సత్యవతికి వాగ్దత్తం చేసి, అం అరణాంతం ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అందుకే ఆయన "భీష్ము''డయ్యాడు. కుమారుని త్యాగనిష్ఠకు సంతసించిన శంతనుడు, భీష్మునకు స్వచ్చంద మరణాన్ని వరంగా అనుగ్రహించాడు.

  • ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీమహావిష్ణువును పూజించాలి. 
  • రోజంతా ఉపవాసం ఉంటూ జాగరణ చేయాలి. 
  • ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన వివిధ రకాల పాపాల నుంచి శాపాల నుంచి విముక్తి కలుగుతుంది.
  • విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి 
  • సంతానం లేని వారు భిస్మునికి తర్పణము చేస్తే సంతానం కలుగుతుంది 

2021 : ఫిబ్రవరి 23.

Post a Comment

0 Comments