స్కంద పురాణంలో శివరాత్రి నాలుగు రకాలుగా చెప్పి వున్నారు. నిత్యా శివరాత్రి అంటే ప్రతి రాత్రిని శివరాత్రిగా భావిస్తారు. తరువాతది మాస శివరాత్రి అంటే ప్రతి నెలలో చతుర్దశి కృష్ణ పక్షం లో వస్తుంది. మూడువడి మాఘ శివరాత్రి మాఘ మాసంలో పదమూడు రోజులు ప్రథమ తిథి నుండి చతుర్దశి వరకు మాఘ శివరాత్రి అని అంటారు. నాలుగవది మహా శివరాత్రి.
చాంద్రమానం ప్రకారం ప్రతినెల కృష్ణపక్షంలోని ప్రదోష వ్యాప్తిగల చతుర్దశి తిథిని మాస శివరాత్రి అని అంటారు.మాసశివరాత్రిని ఎలా జరుపుకోవాలంటే అమావాస్య ముందు వచ్చే మాసశివరాత్రి నాడు ఉపవాసం వుంది సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు తాగుతూ గడపాలి.
- ఉదయాన్నే నిద్రలేచి తరువాత స్నానాదికాలు ముగించుకొని దగ్గరలోని శివాలయం దర్శనం చేయాలి.
- అవకాశం వున్నా వారు శక్తి మేర శివాలయం చుట్టూ 3, 5, 11, 18, 21, 54, 108 ప్రదక్షిణాలు చేయవచ్చు.
- ఈ రోజు ప్రదోషవేళ శివునకు మారేడు దళాలతో లేదా శుద్ధజలంతో అభిషేకాలు అర్చనలు చేయడం మంచిది.
- ఈ చేయడానికి అవకాశం లేని వారు ఉపవాసం వున్నా మంచిది.
- మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి.
- ఈ రోజు మృతుంజయ స్తోత్రం జపించడం, పరమేశ్వరుడికి జిల్లేడుపూలతో పూజ చేయడం వల్ల అపమృతుదోషాలు, దీర్ఘరోగాలు, తొలగిపోతాయి.
- ఎపుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.
- ఈ రోజు రాత్రి అంత జాగరణ చేస్తే మంచిది.
- శివునికి ప్రసాదంగా పండ్లు సమర్పించాలి , పక్క రోజు వ్రతం అయిపోయిన తరువాత ఆ పండ్లను ప్రసాదంగా మనం స్వీకరించాలి.
- ఈ రోజు అంత శివ నామస్మరణలో కాలం గడపాలి. భజనలు, ఆరతిలు ఇంకా శివ పురాణం, ఇవే కాకుండా శివుని లీలలు , శివుడి కథలు ఇంకా శివ మహిమలులతో రోజు అంత గడపాలి.
- ఈ వ్రతం ఆచరించడం వల్ల మనిషిలో రజో,తమో గుణాలు వృద్ధి చెందుతాయి. కోపం,భయం, ఇంకా అనేక చెడు లక్షణాలు మనిషి నుంచి దూరం అవుతాయి.
0 Comments