Ad Code

Responsive Advertisement

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2024 || మేడారం జాతర



సమ్మక్క సారలమ్మ జాతర  లేదా మేడరం జాతర  అనేది తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే  గిరిజన పండుగ. దీనిని తెలంగాణ కుంభమేళా  అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాలలో ఒకటి.

దేశ నలుమూల నుండి గిరిజనులు ఈ ఉత్సవంలో పాలుపంచుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా , ఛత్తీస్గఢ్ , జార్ఖండ్ రాష్ట్రాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు.


భక్తులు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు తమ కోరికలు తీరుస్తారు అని విశ్వసిస్తారు.సంతానం లేని వాళ్లు సంతానం కోసం, పెళ్లికాని ఆడపిల్లలు మంచి భర్త కోసం అమ్మవారికి పూజలు చేస్తారు. బెల్లం, దూడలు, కొబ్బరికాయలు భక్తులు అమ్మవారికి కోరిక తీరిన తరువాత సమర్పిస్తారు. జంపన్న వాగులో స్నానం చేయడం ద్వారా భక్తులు వాళ్ల పాపాలు పూర్తిగా తొలగిపోయినట్లు నమ్ముతారు.

2024 జాతర తేదీలు 

ఫిబ్రవరి 21- సారలమ్మ అమ్మవారు గద్దె మీదకు వస్తారు.

ఫిబ్రవరి 22 -సమ్మక్క అమ్మవారు గద్దె మీదకు వస్తారు.

ఫిబ్రవరి 23 - భక్తులకు అమ్మవార్లు దర్శనం,  భక్తులు నైవేద్యం సమర్పిస్తారు.

ఫిబ్రవరి 24 - జాతరలో ఆఖరిరోజు, అమ్మవార్లు మళ్ళీ వనంకి తిరిగి వెళతారు.

Post a Comment

0 Comments