Ad Code

Responsive Advertisement

ఏ దేవుడికి ఏ ఏ నైవేద్యం పెట్టాలి, ఎవరిని పూజించాలి ?

 ఆదివారం 


ఈ రోజు సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజు

ఈయనను పూజించడం వల్ల అనారోగ్యంతో బాధపడేవారికి ఆరోగ్యం చేకూరుతుంది.

పాలతో చేసిన పదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఈ రోజు ఆదిత్యహృదయం చదివితే మంచిది.


సోమవారం 


ఈ రోజు శివుడికి ప్రీతికరమైన రోజు

శివుడు అభిషేక ప్రియుడు.

ఈ రోజు శివుడికి అభిషేకం చేస్తారు

పండ్లు నైవేద్యంగా పెడుతారు.

శివపురాణం లేదా శివునికి సంబందించిన లీలలు చదువుతారు.


మంగళవారం


ఈ రోజు సుబ్రమణ్య స్వామికి, ఆంజనేయ స్వామికి ప్రీతికరం.

సుబ్రమణ్య స్వామికి పాలు, చలిమిడి, పండ్లు నైవేద్యంగా పెడుతారు 

ఈ రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేసి అప్పాలు, వడలు పండ్లు నైవేద్యంగా పెడుతారు.

హనుమాన్ చాలీసా చదువుకుంటారు.


బుధవారం


ఈ రోజు  వినాయక స్వామికి, అయ్యప్ప స్వామికి ప్రీతికరం.

వినాయకస్వామిని పూజించడం వల్ల ఆటంకాలు కలగవు.

వినాయక స్వామికి కుడుములు, పండ్లు  నైవేద్యంగా పెడుతారు


గురువారం


ఈ రోజు గురుస్వరూపమైన సాయిబాబని, రాఘవేంద్రస్వామిని, దత్తాత్రేయ స్వామిని పూజిస్తారు.

సరస్వతీదేవిని కూడా ఈ రోజు పూజిస్తారు.

బాబాకు రవ్వకేసరి నైవేద్యంగా పెడుతారు


శుక్రవారం


ఈ రోజు లక్ష్మీదేవికి ప్రీతికరం.

ఈ రోజు ఇంట్లోను, బయట కడిగి ముగ్గులుపెట్టి, గుమ్మలకూ పసుపు రాస్తారు.

అమ్మవారికి పులిహోర, క్షీరాన్నం, దద్దోజనం ఏదైనా ఒక్కటి నైవేద్యంగా పెడుతారు.


శనివారం 


ఈ రోజు వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని పూజిస్తారు

శని భగవానుడికి కూడా ఈ రోజు ప్రీతికరం.

వెంకటేశ్వర స్వామికి చక్కరపొంగలి, పులిహోర, లడ్డులు నైవేదంగా పెడుతారు. 

Post a Comment

0 Comments