Ad Code

Responsive Advertisement

శ్రీ శ్వేతార్క మూలగణపతి ఆలయం - కాజిపేట

  • ఈ ఆలయం కాజిపేట విష్ణుపురి కాలనీలోని వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉంది.
  • కొన్ని సంవత్సరాల క్రితం స్వామివారు ఒక భక్తునికి తెల్లజిల్లేడు చెట్టు మూలంలో తీర్చిదిదినట్లు కనిపించారు.
  • ఇక్కడ స్వామివారిని సంకల్ప సిద్ధి కారుడు అని పిలుస్తారు. ఎవరైనా ఒక సంకల్పంతో ఒక కోరిక కోరితే కచ్చితంగా నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం
  • ఈ ఆలయంలో భక్తులు గణపతి మాలను ధరిస్తారు.
  • ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీమహాలక్ష్మి, జ్ఞానసరస్వతి, నవగ్రహాలు, శ్రీ సత్యనారాయణ స్వామి, అయ్యప్ప స్వామి, షిర్డీ సాయిబాబాను దర్శించవచ్చు 
  • వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతాయి.
  • మంగళవారాలు, వినాయక చవితి ఇతర పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి.


ఆలయ వేళలు 


ఉదయం - 5.00  నుండి 11.30 వరకు 

సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.30 వరకు 


మంగళవారాలలో 


ఉదయం - 5.30  నుండి 1.30 వరకు 

సాయంత్రం 4.00 నుండి రాత్రి 9.30 వరకు 


ఎలా వెళ్ళాలి 


వరంగల్ నుండి 12 కిమీ దూరంలో ఉంది .

Post a Comment

0 Comments