Ad Code

Responsive Advertisement

కావేరి పుష్కరాలు

కావేరి నది  భారతదేశంలో ప్రధానమైన నదుల్లో ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. దీని జన్మస్థానం కర్ణాటక, లోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలకావేరి అనే ప్రదేశం. ఈ నదినే దక్షిణ గంగ అని కూడా వ్యవహరించడం జరుగుతుంది.కావేరీ దేవతగా భక్తులు పిలుస్తారు. భక్తుల కోర్కెతీర్చే ఇలవేల్పుగా కావేరీ దేవత పేరు పొందినది. ఈ దేవతకు ప్రతిఏటా శ్రావణమాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది.



బ్రహ్మగిరి కొండల్లో నెలకొని ఉన్న మరియు ఈ నది జన్మస్థానమైన తలకావేరి ఒక సుప్రసిద్ధ యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచింది. తుల సంక్రమణం అనే ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొను వేలాది మంది భక్తులు ఇక్కడ గల మూడు దేవాలయాలను సందర్శిస్తారు. 

తులాసంక్రమణం నాడు వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. రైతులు అధిక సంఖ్య లో దర్శించుకుంటారు .ఆడిమాసం 18 వ రోజు పెరుక్కు అనే పేరు తో పండుగ జరుపుకుంటారు. భక్తిశ్రద్ధల తో నది లో దీపాలు వదులుతారు. 

కర్ణాటకలో పుట్టిన కావేరి తూర్పుదిశ గా కేరళ మీదగా ధర్మపురి జిల్లా వద్ద తమిళనాడు లో ప్రవేశిస్తుంది. పుంపుహార్ వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది దీనిని పుం పట్టినం గా పిలుస్తారు. 

కావేరి నది నీళ్లు తాగితే నూరు యజ్ఞాల ఫలం వస్తుంది అని స్కంద పురాణం చెప్తుంది

మార్కండేయ  పురాణం, అగ్ని పురాణం లో ఈ నది గురుంచి ప్రస్తావనలు వున్నాయి.

కావేరికి  భవాని, హేమావతి, లోకపావని, కానక, శరభంగ, లక్ష్మణ తీర్థ, అమరావతి అనే యాభై ఉపనదులు వున్నాయి.

సెప్టెంబర్ 12  నుంచి  23  వరకు పుష్కారాలు జరుగుతాయి.




Post a Comment

0 Comments