Ad Code

Responsive Advertisement

విశాఖ కనక మహాలక్ష్మి ఆలయం

విశాఖపట్నంలోని ఆలయాలలో ప్రముఖమైనది కనకమహాలక్ష్మి ఆలయం. బురుజుపేటలో నెలకొన్న ఈ ఆలయం క్రిందటి శతాబ్దం పూర్వార్ధంలో వెలుగులోకి వచ్చిందని ప్రతీతి.



స్థానిక కధనం ప్రకారం, 1912 లో శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్టించబడి ఉండేది. రహదారిని విస్తరించడానికి విశాఖ మునిసిఫల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరోచోట ప్రతిష్టించారు. అది జరిగిన 1917 సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రభలి అనేకమంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వలనే జరిగిందని తలచి మళ్ళీ యధాస్థానానికి చేర్చారు. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అమ్మవారి మీద గురి ఏర్పడటం తరువాత ఆమె యొక్క మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందినది.

శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాసం అత్యంత ప్రీతికరం. ఆ నెలలో వచ్చే గురువారం రోజు అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.

మార్గ శిర మాసంలో బుధవారం అర్థరాత్రి 12 గంటలకు మొదలయ్యే పూజలు మరుసటి రోజు అర్థరాత్రి వరకు కొనసాగుతోంది. 

 దీని కోసం ముందుగా కార్తీక శుద్ద ఏకాదశి రోజున అమ్మవారి ఆలయం ఆవరణలో రాట మహోత్సవం నిర్వహిస్తారు. ఆ క్రమంలో మార్గ శిర మాసఉత్సవాలు మొదలైనట్టే.

స్వామి అయ్యప్ప మాదిరిగానే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దీక్షధారణ కూడా కొనసాగుతోంది. కార్తీక శుద్ద ఏకాదశి నుంచి పుష్య శుద్ద పాడ్యమి వరకు 41 రోజుల పాటు మండల దీక్ష కొనసాగుతోంది. 

 దీక్ష మొదటి రోజును గురుమాతచే ఆలయానికి వచ్చి ఆకుపచ్చ వస్త్రాలు ధరించి అమ్మవారికి పూజలు చేస్తారు. ఆ రోజు నుంచి దీక్ష ముగించే వరకు ఉదయం, మద్యాహ్నం, సాయంత్రం తలస్నానం చేసి అమ్మవారి చిత్రపటానికి అష్టోత్తర పూజ, శరణు ఘోష జరిపించాలి. 

దీక్షా కాలంలోబ్రహ్మచర్యం, ఏక భుక్తం పాటిస్తూ మద్యం, మాంసాదులకు దూరంగా ఉండాలి. నిత్యం అమ్మవారి నామస్మరణ చేస్తూ అమ్మవారి నైవేద్యాన్ని ప్రసాదం స్వీకరించడం జరుగుతోంది.

అమ్మవారికి ప్రీతికరమైన మార్గశిర మాసంతో పాటు శ్రావణ మాసం శుక్రవారాలు, శరన్నవరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు ఆలయం ఆవరణలో నిర్వర్తిస్తుంటారు.

అలాగే అమ్మవారి ఆలయంలో ప్రతీ ఏడాది భాద్రప శుద్ద దశమి నుంచి త్రయోదశి వరకు పవిత్రోత్సవలు నిర్వహిస్తారు.

నిత్యపూజలు: ఉదయం పూజ:ఉ. 5 గం, మధ్యాహ్నం పూజ: ఉ 11.30 గం, ప్రదోష పూజ : సా. 6 గం. సర్వదర్శనం ఉ. 6 గం. నుండి



Post a Comment

0 Comments