Ad Code

Responsive Advertisement

మంగళవారం, శనివారం ఆంజనేయస్వామి ని ఇలా పూజించాలి.

ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయి. రామ భక్తున్ని ప్రసన్నం చేసుకోవాలంటే మంగళవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి,చల్లని నీటితో తల స్నానం చేసి నిష్ఠతో శుచిగా ఇంటిని,పూజాగదిని శుభ్రం చేసుకోవాలి.ఆ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.ఆంజనేయ స్వామి పూజ కోరకు బెల్లం ముక్కను, అరటిపండ్లు, తమలపాకులు మొదలగు పూజా సామగ్రిని సమకూర్చుకొని దీపారాధన చేసి ఎర్రని పువ్వులు అలంకరణకు ఉపయోగించి పూజించాలి. అంజని పుత్రునికి నైవేద్యంగా అరటి పండ్లు, శనగలతో చేసిన గుగ్గిళ్లు, నేతితో చేసిన తీపి పదార్థాలు,108 తమలపాకులతో మాల వేయాలి.లేదా జిల్లేడు పూల మాల,వడమాలను కూడా స్వామి వారికి అలంకరించవచ్చును. ముఖ్యంగా వడమాల,బెల్లం,నేతితో చేసిన తీపి పదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 



రామభక్తునికి నివేదన చేసిన ప్రసాదాన్నిఆ తర్వాత పేదలకు,భక్తులకు పంచి పెట్టాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఉప్పు,కారం తక్కువగా ఉన్న సాత్విక పదార్థాలను మాత్రమే తినాలి. నేల మీద చాప వేసుకుని పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరితోనైన ప్రేమ పూర్వకంగా వ్యవహరిస్తూ ఆత్మీయంగా పలకరించాలి.పరిహాసాలు,పౌరుషమైన మాటలను ఎంత మాత్రం చేయకూడదు.

ఒకటే పూట భోజనం చేసి 41 వారాల పాటు మంగళవారం రోజు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో స్వామిపై మనస్సును కేంద్రీకరించి పూజించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుడి వ్రతం వలన శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది, గ్రహ భాదలు తోలగి ధైర్యం చేకూరుతుంది,ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి,ఐశ్వర్యం,సమాజంలో గౌరవం,సంతానం కలుగుతుంది. ఈతి బాధలుండవు.మనస్సుకు ప్రశాంతత దొరుకుతుంది,ఉపాధి అవకాశాలు చేకూరుతాయి,ఉద్యోగంలో ఉన్నత అవకాశాలు, లక్ష్యాలను చేరుకోవడం వంటి శుభఫలితాలుంటాయి. 

భక్తాంజనేయున్నిశనివారం రోజు పూజిస్తే శని గ్రహదోషాలు తొలగిపోతాయి.ప్రతి నిత్యం పూజించి స్మరిస్తే శనిభాదలు ఇబ్బందులు పెట్టవు.ఆంజనేయుడిని శ్రీరామనామ శబ్దం తో ఎవరైతే నిరంతరం స్మరిస్తుంటారో ఆ రామ నామ శబ్ధం విన్నంతనే అక్కడకు ప్రత్యక్షమౌతాడని పురాణాల ద్వార తెలుస్తుంది.స్వామికి తన భక్తులలో వినయ విధేయతలతో ధర్మబద్ధంగా ఉండే వారంటే చాలా ఇష్టం.ముఖ్యంగా ఈ ఆంజనేయున్ని పూజించి ఊరికే ఉండకుండా తమ తమ సామర్ధ్యాలకు తగిన జీవనోపాదికొరకై కృషి చేసిన వారికే శుభఫలితాలు ఇస్తాడు.కేవలం పూజలు,వ్రతాలు, దీక్షలు,చేసి ఫలితం ఆశిస్తే లాభం ఉండదు. ఆంజనేయుడు"కష్టే ఫలే"సిద్దాంతాన్ని ఇష్టపడుతాడు.

Post a Comment

0 Comments