Ad Code

Responsive Advertisement

ఉత్తర ద్వారా దర్శనం.



  • గర్భగుడికి ఉత్తరంగా ఉన్న ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. దీన్ని ‘ఉత్తర ద్వార దర్శనం’ అంటారు.
  • వైకుంఠ ఏకాదశికి తెల్లవారుజామునే వైష్ణవ ఆలయాలలో ఉత్తరద్వారాలను తెరిచి దర్శనభాగ్యం కలిగిస్తారు.
  • దేశంలో వున్నా రంగనాధ ఆలయాలలో, శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణాలయాలలో, శ్రీ రామాలయాలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి.
  • అన్నవరం వంటి క్షేత్రాలలో యాదాద్రి, ధర్మపురి, వేదాద్రి, అహోబిలం వంటి లక్ష్మి నరసింహస్వామి ఆలయాలలో వైకుంఠ ద్వారా దర్శనం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
  • ఏకాదశి గడియలు ప్రారంభం అయిన్పటినుంచి  ద్వాదశి తిధి ప్రవేశించే వరకు ఉత్తరద్వారాలు తెరిచి ఉంచుతారు.
  • వైష్ణవ సంప్రదాయంలో ఉత్తరద్వార దర్శనం మోక్ష ప్రాప్తి కి  హేతువు.వైకుంఠ ఏకాదశికి తప్ప సాధ్యం కానీ ఉత్తరద్వార దర్శనంని అనునిత్యం భక్తులకు కల్పిస్తున్న ద్వారకా తిరుమల మోక్ష క్షేత్రం.
  • త్రేతాయుగంలోద్వారకా మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి చీమల పుట్ట నుండి ప్రత్యక్షమైన స్వామి  ఈ క్షేత్రంలో దక్షిణాభిముఖంగా వెలిసాడు.
  • శివాలయాలలో కూడా ఉత్తరద్వార దర్శనం కలిపిస్తారు. వేములవాడ, శ్రీ కాళహస్తి, శ్రీశైలం తదితర ప్రసిద్ధమైన శివాలయాలలో  ఉత్తరద్వార దర్శనం నిర్వహిస్తారు.
  • శివకేశవులకు ఎలాంటి బేధం లేదు అనడానికి ప్రతీకగా శివాలయాలలో కూడా ఉత్తరద్వార దర్శనం కలిపిస్తారు.

Post a Comment

0 Comments