Ad Code

Responsive Advertisement

ధనుర్మాసంలో యోగనిద్ర నుంచి విష్ణుమూర్తి




మార్గశిర మాసంలో ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు.

భువి పైన మన సంవత్సరాన్ని దివిలో ఒకరోజుగా లెక్కించే దేవతలకు మార్గశిరం బ్రహ్మీ ముహుర్తంగా పేర్కంటారు. అంటే సూర్యోదయానికి ముందు తొంభై ఆరు నిమిషాలు. 

కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు ఆ యోగనిద్ర నుండి మేల్కొని శుద్ద త్రయోదశినాడు సకల దేవతాయుతడై బృందావనానికి చేరుకుని, ధనుర్మాసంలో వచ్చే శుద్ద ఏకాదశి నాడు ఉత్తర ద్వారము నుండి మనకు దర్శన భాగ్యమును కలిగిస్తాడు.

ఆ దివ్య దర్శనం భాగ్యం వల్ల క్షీణించిన శక్తియుక్తులు తిరిగి చేకూరతాయి.దీనినే రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలానికి సంకేతంగా చెప్తారు. 

ఈ ధనుర్మాసం అరంభానికి ముందు గృహం లోపల పవిత్రమైన గోమూత్రంతో శుద్ది చేయాలి. ఇంటి బయట ముంగిళ్ళలో కళ్ళాపి జల్లాలి. దీనివలన అనారోగ్యకారకాలైన క్రిములు నశిస్తాయి. 

ఇలా పవిత్రములైన గొబ్బెమ్మల నుంచి వాటిని, పూలు, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు.

భగవాదారాధనను ఎన్నడూ మరువరాదనే విషయాన్ని గుర్తుచేసే హరిదాసులు నామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటారు. వీరిని గౌరవించినా భగవదారాధనే అవుతుంది.

వృషభాన్ని అలకరించి దాన్ని ఇళ్ళముందుకు తెచ్చి వానితో నృత్యం చేయిస్తూ ఆనందింప చేస్తారు. ఆనందం కూడా లక్ష్మీ స్వరూపమే. అంతేకాక వృషభాల గిట్టల స్పర్శ వలన ఆ ప్రదేశం కూడ పవిత్రమవుతుంది. 

ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం రోజు గోపూజ అత్యంత ప్రధానమైనది. 

ఈ మాసం ప్రకృతిలో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది.


Post a Comment

0 Comments