Ad Code

Responsive Advertisement

ద్వారకా తిరుమల లో గిరి ప్రదక్షిణ

ద్వారకాతిరుమల క్షేత్రంలో శ్రీవారి గిరి ప్రదక్షిణను తొలిసారిగా ఈ ఏడాది నిర్వహించనున్నారు.తమిళనాడులో అరుణాచలం, మన రాష్ట్రంలో సింహాచలం, అన్నవరం దేవస్థానాల్లో గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ద్వారకాతిరుమల క్షేత్రంలో చినవెంకన్న మాలధారులు మాత్రమే ఏటా ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజామున గిరి ప్రదక్షిణలు చేసి ఆలయ ఉత్తరద్వారం గుండా శ్రీవారి నిజరూప దర్శనం చేసుకోవడం ఆచారంగా వస్తోంది. 



కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి ద్వారకాతిరుమల క్షేత్రంలో శేషాకృతిలో ఉన్న కొండపైన స్వయంభువుగా వెలిశారు. దేవాలయానికి వెళ్లిన ప్రతి భక్తుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం పరిపాటి. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా తమ పాపాలను నశింపజేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారని నమ్ముతారు. అదే విధంగా శ్రీవారి ఆలయం నిర్మితమైన కొండ చుట్టూ ప్రదక్షిణకు కూడా ఎంతో విశిష్టత ఉందని.. దీనిని పూర్తిచేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి అని భక్తులు నమ్ముతారు.

గిరి ప్రదక్షిణ మార్గం ఇలా...

ఆలయ మెట్లపై హారతి వెలిగించి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు, దొరసానిపాడు, రాళ్లకుంట, శ్రీవారి పుష్కరిణి (మాధవానికుంట) మీదుగా తిరిగి శ్రీవారి ఆలయ మెట్ల వద్దకు చేరుకుంటారు.మొత్తం పది కిలోమీటర్లు  

ఈనెల 17న మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ మెట్లపై హారతి వెలిగించి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు.

Post a Comment

0 Comments