Ad Code

Responsive Advertisement

పాల్గుణ మాసం విశిష్టత





  • వినీల ఆకాశంలో ,శ్వేత వర్ణంతో దండకారంగా ప్రకాశిస్తున్న రెండు  నక్షత్రాలతో కూడిన మండలమే ఫల్గుణి నక్షత్రం.
  • చాంద్రమానంలోని పన్నెండు మాసాలలో పాల్గుణమాసం చివరిది.
  • ఈ నెలలోని పౌర్ణమినాడు చంద్రుడు పూర్వఫల్గుణి లేదా ఉత్తరఫల్గుణి నక్షత్రానికి దగ్గరగా ఉండటం చేత ఇది పాల్గుణమాసం అయింది.
  • ఆరు ఋతువులలో ఆఖరిదైనా శిశిర ఋతువు ఈ మాసంతో ముగుస్తుంది.
  • సూర్యుడు ఫాల్గుణ మాసంలో మీనా రాశిలో ప్రవేశిస్తాడు.
  • ఈ మాసం విష్ణువుకు ప్రీతికరం అని భాగవతం చెబుతోంది.
  • ఈ నెలలో విష్ణువుని పూజించడం విశేష ఫలదాయకం.
  • ఈ మాసంలో చేసే దానాల వల్ల గోవిందుని అనుగ్రహం లభించి అరిష్టాలు హరింపబడుతాయి.
  • ఈ మాసంలో గోదానం చెప్పలేనంత ఫలితాన్నిస్తుంది.
  • పాల్గుణ పాడ్యమి రోజునే రామ, రావణ యుద్ధంలో ముఖ్య ఘట్టం.
  • రావణ సంహారం జరిగింది పాల్గుణ అమావాస్య.
  • మహాభారతంలో ధర్మరాజు, భీమసేనుల జననం ఈ మాసంలోనే జరిగింది.
  • భారతంలో ప్రతి నాయకుడైన దుర్యోధనుడు అతని సహోదరుడైన దుశ్యాసనుడు ఈ మాసంలోనే జన్మించారు.
  • ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మాధుక వ్రతం చేస్తారు.
  • ఈ మాస శుద్ధ చవితిని తిల చతుర్థి   అని అంటారు. ఈ రోజు ఉపవాసం  చేసి తిలాన్నంతో హోమం చేసి బ్రాహ్మణ భోజనానంతరం  భుజించాలి దీని వల్ల సర్వ విజ్ఞాలు నశిస్తాయి. ఈ రోజు పుత్ర గణపతి వ్రతం ఆచరించిన వారికీ సంతానం కలుగుతుంది.
  • పంచమి నాడు అనంత పంచమి వ్రతాన్ని, సప్తమి నాడు ఆర్కాసంపుట సప్తమిని ఆచరించాలి.
  • పాల్గుణ శుద్ధ అష్టమి లక్ష్మిదేవికి ప్రీతికరమైన రోజు. ఈనాడు లక్ష్మీదేవిని, సీతాదేవిని అర్చించి, ప్రదోష సమయంలో దీపారాధన చేస్తే సౌభాగ్యం, సంపద కలుగుతాయి.ఈ రోజు లలితకాంతిదేవి వ్రతం చేస్తారు.
  • నవమినాడు ఆనందనవమిని, ఏకాదశిని అమలక ఏకాదశిగా నిర్వహిస్తారు.
  • శుద్ధ ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిధి. దీన్నే నృసింహ ద్వాదశి అని అంటారు. శ్రీ నృసింహ ఆరాధన చేస్తే అభిష్టసిద్ధి కలుగుతుంది.ఈ పర్వాన్ని కామదాహాని అని కూడా అంటారు. ఈ రోజు గ్రామ క్షేమం కోసం మన్మధ విగ్రహ దహనం చేస్తారు.
  • శుద్ధ చతుర్దశికి మహేశ్వర వ్రతం చేయాలి.
  • హోళికా పూర్ణిమ నాడు పగలు గోక్రీడలు, సాయంత్రం హోలీ ఉత్సవం నిర్వహిస్తారు.ప్రదోష సమయంలో దీపం వెలిగించి లక్ష్మీనారాయణ అర్చన చేస్తే సర్వ సంపదలు శుభాలు కలుగుతాయి.
  • పౌర్ణమి తరువాత వచ్చేది పాడ్యమి ఆరోజు ధూళి వందనం చేయాలి.
  • పాల్గుణ మాసంతో శీతాకాలం ముగిసి, వసంత కలం ప్రారంభం అవుతుంది.
  • పాల్గుణ మాసంలో దేవత ఆరాధన, ఉత్సవాలతో పాటు పితృ ఆరాధన కూడా చేయాలనీ శాస్త్రం.
  • పాల్గుణ మాసంలో ప్రవచనాలు వినడం, దేవాలయాలను సందర్శించడం మంచిది.


2021 :  మార్చి 14 నుండి ఏప్రిల్ 12 వరకు

Post a Comment

0 Comments