Ad Code

Responsive Advertisement

శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయం - ఘటిక సిద్ధేశ్వరం

శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా, సీతారామపురం మండలంలోని సిద్దేశ్వర కోనలో ఉంది. ఇక్కడ శివుడు సిద్దేశ్వర స్వామిగా కొలువైవున్నారు. అమ్మవారు ఇష్టకామేశ్వరీదేవి.


ఆలయ చరిత్ర :


అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఇది ఒకటి. 6వ శతాబ్దానికి పూర్వం వెలసినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. సప్త రుషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు  రసరత్నాకర గ్రంథంలో పేర్కొన్నారు.1406లో విజయనగరం సామ్రాజ్యాన్ని పాలించిన రెండో హరిహరరాయులు, ఆయన తనయుడు మొదటి దేవరాయులు ఈ ఆలయానికి ప్రాకార మండపం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం జీర్ణవ్యవస్థకు చేరుకున్న సమయంలో … 1974లో అవధూత కాశినాయన ఈ క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేశారు.


ఉత్సవాలు:


ప్రతి సంవత్సరం శివరాత్రి మరియు కార్తీక పౌర్ణమి నాడు ఉత్సవాలు నిర్వహిస్తారు.ఇచట కొలువుదీరిన ఇష్టకామేశ్వరీదేవి అమ్మవారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలందుకుంటారు.


ఆలయ వేళలు :

ఉదయం 6.00 నుండి సాయంత్రం 6.00 వరకు 


ఎలా వెళ్ళాలి :


ఉదయగిరి నుండి 30  కి.మీ 

బద్వేల్ నుండి 73 కి.మీ

అమరావతి నుండి 300 కి.మీ 


Post a Comment

0 Comments