సంక్రాంతి వేడుకల్లో కోనసీమ ప్రత్యేకం ప్రభల తీర్థం. ఇది కనుమ పండుగ రోజున జగ్గన్న తోటలో జరుగుతుంది.
జగ్గన్న తోట తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మొసలపల్లి-ఇరుసుమండ గ్రామాల సరిహద్దులో వుంది.
జగ్గన్న తోట ఏడెకరాల విస్తీర్ణంలో వుంది.
మొసలపల్లి గ్రామదైవం భోగేశ్వర స్వామి ఆహ్వానంపై చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మరో పది పరమేశ్వర ప్రతీకలైన ప్రభలు తరలివస్తాయి.
ప్రభలను వెదురుకర్రలతో తయారు చేస్తారు. రంగురంగుల వస్త్రాలతో పూలతో అలంకరించిన ప్రభలు శివుని ప్రతిరూపంగా భావిస్తారు.
గంగలకుర్రు అగ్రహారంలోని వీరేశ్వరస్వామి,చెన్నమల్లేశ్వర స్వామి, వ్యాగ్రేశ్వరంలోని వ్యాగ్రేశ్వర స్వామి, పెదపూడిలోని మేనకేశ్వర స్వామి, ఇరుసుమండలోని ఆనందరామేశ్వర స్వామి, వక్కలంక గ్రామదైవం కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు - చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల - రాఘవేశ్వర స్వామి పాలగుమ్మి - మల్లేశ్వర స్వామి, పుల్లేటికుర్రు - అభినవ వ్యాగ్రేశ్వర స్వామి తో పాటు మొసలపల్లి భోగేశ్వరస్వామి ప్రభలు తీరానికి విచ్చేస్తాయి.
మాములు రహదారుల పై వీటిని తీసుకోనిరారు
పొలాల మధ్య నుంచి ప్రభలు రావడం వల్ల పంటలు బాగా పండుతాయని రైతులు భావిస్తారు.
మేళతాళాలతో, బాజాబజంత్రీలతో, మంగళ వాయిద్యాలతో ఆనంద పారవశ్యంతో జగ్గన్న తోటకి ఊరేగింపుగా భక్తులు వస్తారు.
ప్రభలన్నింటినీ వరుసగా నిలిపివుంచి నృత్యవాయిద్యాలతో శివునికి ప్రీతి కలిగిస్తారు. భక్తులు నమస్కరించి ఆశీస్సులు అందుకుంటారు.
2021 : 15, జనవరి
0 Comments