Ad Code

Responsive Advertisement

అట్ల తద్దె

  • ఆశ్వయుజ బహుళ తదియ నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దీనిని చంద్రోదయ వ్రతం అని కూడా అంటారు.
  • ఈ రోజు స్త్రీలు చంద్రోదయం అయ్యేంత వరకు ఉపవాసం ఉంది ఉమాదేవిని పూజించాలి.
  • ఈ పూజలో విధిగా మినుముల పిండి, బియ్యపుపిండితో చేసిన అట్లను అమ్మవారికి నివేదించాలి. 
  • పూజానంతరం చంద్రుణ్ణి చూసి పసుపు, కుంకుమ,నల్లపూసలు, అట్లను ముత్తైదువులకు వాయనంగా యివ్వాలి.
  • ఈ నోమును నోచుకోవడం వల్ల కన్యలకు మంచి భర్త లభిస్తాడు.
  • పెండ్లి వారికి నిండు ఐదవతనం వుంటుంది.
  • ఈ వ్రతాచరణ వల్ల స్త్రీలకు ఋతుసంబంధమైన సమస్యలు, గర్భదోషాలు నివారించబడతాయని కూడా చెబుతాయి.


అట్ల తద్ది కథ


అట్లతద్దికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక రాజు కూతురు , మంత్రి కూతురు , సేనాపతి కూతురు , పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా ఉండేవారు. అట్లతద్ది రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత పూజ చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ లోగా  రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. చెల్లెలి అవస్థ చూసి తల్లడిల్లిపోయిన రాకుమారులు అద్దంలో ఓ తెల్లని వస్తువు చూపించి చంద్రోదయం అయింది కొంచెం తినేశాక పూజ చేసుకో అని చెప్పారు. అన్నల మాట విశ్వసించిన ఆమె తినేసింది.   ఇది జరిగిన కొద్ది కాలానికి ఆనలుగురు స్నేహితురాళ్లకు పెళ్లైంది. మంత్రి,సేనాపతి, పురోహితుని కూతుర్లకు వయసుకి తగ్గా భర్తలు రాగా... రాకుమార్తె కు మాత్రం ముసలి భర్త దొరికాడు. వ్రతం చేసినా తనకు మాత్రం ఎందుకిలా జరిగిందని ఆమె బాధపడగా..అప్పుడు మిగిలిన వారంతా జరిగిన విషయం చెప్పారు. ఆ మర్నాడే ఆశ్వయుజ బహుళ తదియ అని ఆ రోజు 'చంద్రోదయ ఉమా వ్రతం' (అట్ల తద్ది) చేస్తే సమస్య తీరుతుందని చెప్పారు. ఆమె యధావిధిగా పూజ చేసి అక్షతలు భర్త మీద చల్లగానే ఆయన కూడా శాపవిమోచనం పొందినట్టు ఆమెకు తగ్గా భర్తలా మారాడు. అందుకే కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే ఉత్తముడైన భర్త లభిస్తాడని, వివాహితులు చేస్తే సౌభాగ్యంతో తులతూగుతారని పురాణాలు చెబుతున్నాయి. 


2022 : తేదీ : అక్టోబర్ 12.

Post a Comment

0 Comments