Ad Code

Responsive Advertisement

2022: శ్రీ కపిలేశ్వరాలయంలో విశేష‌పూజ హోమ మ‌హోత్స‌వాలు

 తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధ‌వారం గణపతి హోమంతో విశేషపూజహోమ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. 


ఈ సంద‌ర్భంగా ఉద‌యం పంచ‌మూర్తుల‌కు పాలు, పెరుగు, తేనె, చంద‌నం, విభూదితో విశేషంగా స్న‌ప‌న‌తిరుమంజ‌నం నిర్వ‌హించారు. సాయంత్రం గ‌ణ‌ప‌తిపూజ‌, పుణ్య‌హ‌వ‌చ‌నం, వాస్తుపూజ‌, ప‌ర్య‌గ్నిక‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ‌, క‌ల‌శ‌స్థాప‌న‌, అగ్నిప్ర‌తిష్ఠ‌, గ‌ణ‌ప‌తి హోమం, ల‌ఘుపూర్ణాహుతి నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబ‌రు 27వ తేదీ కూడా గణపతి హోమం జరుగనుంది.


అక్టోబ‌రు 28వ తేదీ నుంచి శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం :


శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 28 నుండి 30వ తేదీ వ‌ర‌కు శ్రీసుబ్రమణ్య స్వామివారి హోమం మూడు రోజుల పాటు ఘనంగా జరుగనుంది. అక్టోబ‌రు 30న సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామివారి క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.


కాగా, అక్టోబరు 31న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, న‌వంబరు 1న శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, న‌వంబ‌రు 2న శ్రీ నవగ్రహ హోమం, న‌వంబరు 3 నుంచి 11వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం), నవంబరు 12 నుంచి 22వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం(రుద్రయాగం), న‌వంబరు 22న శ్రీ శివ‌పార్వ‌తుల క‌ల్యాణం చేప‌డ‌తారు. న‌వంబ‌రు 23న శ్రీ చండికేశ్వ‌ర‌స్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచ‌మూర్తుల ఆరాధ‌న‌ నిర్వహిస్తారు.

Post a Comment

0 Comments