Ad Code

Responsive Advertisement

శబరిమల అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు విశిష్టత




అయ్యప్ప స్వామి ఆలయంలో దీక్షాదారులను మాత్రమే పద్దెనిమిది మెట్ల పై ఎక్కి స్వామిని దర్శించుకోవడానికి అనుమతి ఇస్తారు.

ఆ పద్దెనిమిది మెట్లుకు అరిషడ్వర్గాలు, దంభం, అహంకారాలు, పంచేద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్య అనేవి ప్రతీకలు. ప్రతి మెట్టుకు ఒక అది దేవత ఉన్నారు వారి గురు తెలుసుకుందాం.

కామం - 1 వ మెట్టు : అధిదేవత గీతమాత. ఈ మెట్టును స్పర్శించడం వల్ల మానసిక శుద్ధి కలుగుతుంది.

క్రోధం -  2 వ మెట్టు : అధిదేవత గంగాదేవి.ఈ మెట్టును అధిరోహించడం వల్ల ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది.

లోభం - 3 వ మెట్టు : అధిదేవత గాయత్రీ మాత. మరణాంతరం ఉత్తమగతులు కలుగుతాయి.

మొహం 4 వ మెట్టు : అధిదేవత సీతాదేవి. జ్ఞానయోగానికి ప్రతీక.

మదం 5 వ మెట్టు : అధిదేవత సత్యవతి మాత. కుటుంబంలో వారి అందరికి ఉత్తమగతులు కలిగింప చేస్తుంది.

మాత్స్చర్యం  6 వ మెట్టు : అధిదేవత సరస్వతి దేవి. విష్ణుసాయుజ్యం, సమస్త దానఫలం లభిస్తాయి.

దంభం 7 వ మెట్టు : అధిదేవత బ్రహ్మ విద్య దేవి . ఈ మెట్టు స్పర్శ వల్ల పునర్జన్మ కలగదు.

అహంకారం 8 వ మెట్టు : అధిదేవత బ్రహ్మ వల్లి దేవి. ఈ మెట్టు వలన  స్వార్ధం, రాక్షసత్వం నశిస్తాయి.

నేత్రములు 9 వ మెట్టు : అధిదేవత త్రిసంధ్య దేవి . ఈ మెట్టు వలన ఋణభాదలు తీరుతాయి.

చెవులు 10 వ మెట్టు : అధిదేవత ముక్తి గేహిని దేవి.  ఈ మెట్టు వలన ఆశ్రమధర్మం పుణ్యఫలం, జ్ఞానం కలుగుతాయి.

నాసిక 11 వ మెట్టు : అధిదేవత అర్ధమాత్రా దేవి. ఈ మెట్టు వలన అకాలమృత్యుభయం ఉండదు.

జిహ్వ  12 వ మెట్టు : అధిదేవత చిదానందా దేవి. ఈ మెట్టు వలన ఇష్టదేవత దర్శనం లభిస్తుంది.

స్పర్శ 13 వ మెట్టు : అధిదేవత భవహ్గ్ని దేవి.ఈ మెట్టు వలన పాపాలు నశిస్తాయి.

సత్యం 14 వ మెట్టు : అధిదేవత భావనాశిని దేవి. ఈ మెట్టు వలన స్త్రీహత్యపాతకాలు నశిస్తాయి.

తామసం  15వ మెట్టు : అధిదేవత వేదత్రయీ దేవి . ఈ మెట్టు వలన మోక్షం కలుగుతుంది.

రాజసం  16వ మెట్టు : అధిదేవత పరాదేవి. ఈ మెట్టు వలన దేహసుఖం, బలం లభిస్తాయి.

విద్య 17వ మెట్టు : అధిదేవత అనంతాదేవి . ఈ మెట్టు వలన దీర్ఘవ్యాధులు సైతం నశిస్తాయి.

అవిద్య  18 వ మెట్టు : అధిదేవత జ్ఞానమంజరి దేవి. ఈ మెట్టు వలన యజ్ఞఫలం, ఆర్ధిక స్థిరత్వం కలుగుతాయి.

Post a Comment

0 Comments