Ad Code

Responsive Advertisement

దీపం దర్శయామి

కుండలో దీపాన్ని వెలిగిస్తే ఆ దీప కాంతి అన్ని వైపులకు ప్రసరించి కాంతిని వేదజల్లుతుంది . అలాగే మన శరీరంలో జ్ఞాన జ్యోతి జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకాశిస్తుంటే మనం అన్నిటినీ తెలుసుకోగలుగుతాం. 



లోపలి పరంజ్యోతి తెలుసుకునేందుకు ఆధారభూతమైంది బయట మనం వెలిగించే దీపం. అంటే బయట దీపాన్ని గురువుగా భావించాలి.

హృదయంలోని పరమాత్మను జ్ఞానజ్యోతి  ద్వారా దర్శించగలగాలి. ఆర్తితో, ఏకాగ్రతతో లోపల శోధించాలి. అప్పుడే భగవంతుని దర్శనం లభిస్తుంది.

దీపం వెలిగించి పూజ చేసే సమయంలో దీపం దర్శయామి అన్న ఉపచారము వచ్చిన అప్పుడు దీపకాంతిలో పరమాత్ముని పాదాలు దర్శించాలి.

నందాదీపం : దీన్ని అఖండదీపం అన్ని కూడా అంటారు. తిరుమలక్షేత్రంలో ఈ దీపం వెలుగుతూ ఉంటుంది. స్వామి స్వయంభువుగా పద్మపీఠం పై ప్రతిష్ఠలైనప్పుడు చతుర్ముఖ బ్రహ్మ తొలి దీపాన్ని వెలిగించాడు.

అర్చాదీపం : మనం నిత్యం పూజలో వెలిగించే దీపాన్ని అర్చా దీపం అన్ని అంటారు.

లక్ష్మి దీపం : లక్ష్మిదేవి అంతరాలయంలో వెలిగించే దీపాన్ని లక్ష్మి దీపంగా పిలుస్తారు.

బలిదీపం : ఆలయంలో బలిహరణ స్తంభం వద్ద వెలిగించే దీపాన్ని బలిదీపం అంటారు.

ఆకాశ దీపం : కార్తీకమాసంలో తప్ప మిగిలిన ఏమాసంలో కూడా ఈ దీపాన్ని వెలిగించరు. కార్తీకమాసం ఆరంభం నుంచి ఆలయంలో ధ్వజస్తంభం పైన తాడు సాయంతో  ఆకాశ దీపం వెలిగిస్తారు. దీనిని చూడడం, వెలిగించడం కూడా విశేషమైన ఫలితం కలిగిస్తుంది.

నిరంజనా దీపాలు : అనేకమైన కుందులలో గుత్తులుగుత్తులుగా దీపాలు వెలిగిస్తే వాటిని నిరంజనా దీపాలు అంటారు.

Post a Comment

0 Comments