Ad Code

Responsive Advertisement

శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయం - అర్ధగిరి





శ్రీ అర్ధగిరి వీరాంజనేయ వారి వారి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకానికి 14 కిలోమీటర్ల దూరంలో వున్నది. ఈ ఆలయం రామాయణ కాలానికి సంబంధించి అని చెపుతారు. సంజీవిని పర్వతం కోసం వెళ్లిన ఆంజనేయ స్వామి వారు దానిని తీసుకువచ్చే క్రమంలో కొంత పర్వతం ఈ ప్రదేశంలో పడింది అని చెపుతారు.

కొంత ఇక్కడా పాడడం వాళ్ళ ఈ ప్రాంతానికి "అర్ధగిరి" అని పేరు వచ్చింది.ఇక్కడ ఒక్క పెద్ద పుష్కరిణి వున్నది. ఈ పుష్కరిణిలో నీరు సేవించడం  వల్ల అటువంటి జబ్బులు అయిన నయం అవుతాయి అని భక్తుల విశ్వాసం.దీర్ఘకాల రోగాలు కూడా నయం అవుతాయి అని భక్తుల ప్రగాఢ నమ్మకం.



తొమ్మిది నెలల్లో తొమ్మది పౌర్ణమిలు ఇక్కడ నీరు త్రాగడం వల్ల అన్ని వ్యాధులు నయం అవుతాయి.

ఇంకా చరిత్ర విషయానికి వస్తే ఇది రామాయణ కలం నాటి ఆలయం.

ఇంకా దేవాలయ ప్రక్కన శివాలయం, రామాలయం, శ్రీ సుబ్రమణ్యస్వామివారు, వినాయక స్వామివారు, అయ్యప్ప స్వామి వారు, నవగ్రహాలు ఈ ఆలయ పరిసరాలలో వున్నాయి.

ఇక్కడ గర్భలయంలో స్వామివారు ఉత్తర దిక్కున మనకు దర్శనం ఇస్తారు. ఇలా దర్శనం ఇవ్వడం చాల అరుదుగా కనపడుతుంది. చాల మంది చెపిన దాని ప్రకారం భారతదేశం లోనే ఈ ఒక్క ఆలయం స్వామి వారు ఉత్తర దిక్కున దర్శనము ఇస్తారు.


  • పౌర్ణమి రోజులలో ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది.
  • హనుమాన్ జయంతి ఇక్కడ చాల ముఖ్యమైన పండుగ.



ఆలయ వేళలు :

ఉదయం  5 :30  నుండి రాత్రి  9.00  వరకు.

ఇక్కడ వసతి పూర్తిస్థాయి లో అందుబాటులో లేదు.

ఎలా వేలాలి :

కాణిపాకం నుండి 14  కిలోమీటర్లు, తిరుపతి నుండి 80 కిలోమీటర్లు. బస్సులు(apsrtc ) అందుబాటులో ఉంటాయి.

Post a Comment

0 Comments