Ad Code

Responsive Advertisement

కార్తీక మాసంలో వనభోజనం ఎందుకు చేస్తారు ?

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద పూజ చేసి వనభోజనాలు చేయడం సంప్రదాయంగా వస్తుంది.



  • కార్తీక పురాణంలోని పంచమాధ్యాయం వనభోజనాలు విశిష్టత గూర్చి చెప్పింది.
  • కార్తీక మాసంలో వనభోజనాలు చేసినవారు సకల పాపాల నుండి విముక్తులై దైవ ధామాన్ని పొందుతారు.
  • ఔషధ గుణాలు నిండిన ఉసిరిక చెట్టును సరస్వతి అంశగా చెబుతారు.
  • కార్తీక మాసంలో ఈ ఉసిరిక చెట్టును కార్తీక దామోదరునితో పాటు దేవతలు అందరు ఆశ్రయించి ఉంటారు.
  • కార్తీక మాసంలో ఎదో ఒక రోజు వన భోజనం చేయాలి, ఇలా చేయడం వల్ల మానసిక ఉల్లాసం, ప్రశాంతత లభిస్తుంది.
  • ఉసిరి చెట్టు నీడ ఆరోగ్యానికి మంచిది.


వనభోజనం కంటే ముందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామాన్ని పూజించాలి.ఇలా చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలం వస్తుంది అనిఅంటారు.తరువాత అన్నసమారాధన చేయాలి.

సూతమహర్షి నైమిశారణ్యంలో కార్తీకపౌర్ణమి నాడు మునులందరితో కలిసి ఉసిరి చెట్టు కింద భుజించాడు.

వనభోజనం చేసే సమయంలో శివునికి అన్నపూర్ణాదేవి చేసిన విందు, వ్యాసుని విందు, శబరి రామునికి చేసిన విందు, కృష్ణుడు కుచేలునికి ఇచ్చిన ఆతిధ్యం గుర్తుచేసుకోవాలి.

Post a Comment

0 Comments