Ad Code

Responsive Advertisement

బుద్ధుడు చెప్పిన ఐదు విషయాలు.

పురుషులు, స్త్రీలు, గృహస్థులు, సన్యాసులు- అందరూ ఈ అయిదు విషయాలపై తప్పనిసరిగా దృష్టి నిలపండి! 

1. ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం కలుగుతుంది- దాన్ని నేను తప్పించుకోలేను.
 
2. ఏదో ఒకనాడు నేను అనారోగ్యం పాలవుతాను- దాన్ని నేను తప్పించుకోలేను.
 
3. ఎప్పుడైనా మృత్యువు నన్ను కబళిస్తుంది- దాన్ని నేను తప్పించుకోలేను. 

4. నేను ఎంతగానో ప్రేమించి, నావి అని మమకారం పెంచుకునే వస్తువులన్నీ మార్పునకో, నాశనానికో, ఎడబాటుకో లోనుకావచ్చు- దాన్ని నేను తప్పించుకోలేను. 

5. నేను చేసిన పనులు అంటే స్వకర్మల వల్లనే నేనిలా తయారయ్యాను. నా పనులు మంచివైనా, చెడువైనా- వాటికి నేను బాధ్యత వహించాల్సిందే.’ 

Post a Comment

0 Comments