Ad Code

Responsive Advertisement

అలాహాబాద్ అర్దకుంభ మేళా - 2019

కుంభం అనే పదానికి కుండా లేదా కలశం అనే అర్దాలు ఉన్నాయి. భారతీయ ఖగోళ శాస్త్ర  ప్రకారం కుంభం ఒక రాశి. మేళా  అంటే కలయిక అని అర్ధం, ఈ రెండు అర్ధాలను సమన్వయం చేస్తే  కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కుంభమేళా అవుతుంది.



ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలాహాబాద్ నగరంలో త్రివేణి సంగమం ఉంది. ఇక్కడ గంగ, యమునా, సరస్వతి నదులు కలుస్తాయి.

కుంభమేళా ఉత్సవం ఆచరణలోకి రావటం వెనుక పురాణగాథ వుంది. క్షీర సాగర మదించే సమయంలో రాక్షసుల చేతికి చిక్కిన అమృతాన్ని వారి నుంచి విడిపించేందుకు మహావిష్ణువు మోహిని అవతారం ధరించాడు. తన మాయావిలాసంలో అమృతకలశాన్ని చేజికించుకొని దేవతలకు పంచి పెట్టేస్తాడు. ఈ క్రమంలో విష్ణువు చేతులో ఉన్న అమృతకలశం నుంచి నాలుగు బిందువులు జారీ భూమి మీద నాలుగు ప్రాంతాలలో నదీజలాలలో పడుతాయి.

అవే ప్రయాగ(అలాహాబాద్), హరిద్వార్, నాశిక్, ఉజ్జయిని. అమృత బిందువులు కలిసిన పుణ్యవిశేషం చేత ఆ నదీజలాలు పవిత్రత, శక్తిని పొందాయి. ఇందుకు ప్రతీకగా ఆ నాలుగు ప్రాంతాలలో కుంభమేళాలు జరుగుతాయి.  ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్దకుంభ మేళా జరుగుతుంది.సూర్యుడు మకరరాశిలో ఉన్నపుడు అలాహాబాద్ లోని ప్రయాగలో కుంభమేళాలు జరుగుతాయి.

  • ప్రయాగ అంటే యాగం చేసే స్థలం అని అర్ధం.
  • సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించాలనే తలంపుతో బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞాన్ని నిర్వహించాడు.
  • ప్రయాగలో చనిపోతే స్వర్గం వరిస్తుంది అని చెబుతారు.
  • ప్రయాగ ప్రాముఖ్యతను గురించి మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెపినట్లు మత్స్యపురాణంలో ఉంది.
  • త్రికరణ శుద్ధిగా ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానము చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి.
మకర సంక్రమణం నుండి మహా శివరాత్రి వరకు కుంభమేళా ఉత్సవం జరుగుతుంది.వాటిలో కొన్ని ముఖ్యమైన పర్వదినాలలో స్నానాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

జనవరి 15 - మకర సంక్రాంతి
జనవరి 21 - పుష్య పూర్ణిమ
ఫిబ్రవరి 04 - మౌని అమావాస్య
ఫిబ్రవరి 19 - మాఘ పూర్ణిమ
మార్చి04  - మహాశివరాత్రి

కుంభమేళాలో సాధువులు వేల సంఖ్యలో స్నానాలు ఆచరిస్తారు. వీరిని  శివుని ప్రధమ గణాలుగా భావిస్తారు.
సాంప్రదాయ స్నానాలతో పాటు, వేద పారాయణాలు , సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, భజనలు, ఆధ్యాత్మిక గీతాలు, వివిధ యజ్ఞాలు, ప్రవచనాలు కూడా జరుగుతాయి.

Post a Comment

0 Comments