Ad Code

Responsive Advertisement

రుద్రనాథ ఆలయం - ఉత్తరాఖండ్.

రుద్ర ప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఒక చిన్న పట్టణం.రుద్రప్రయాగ లో ఉన్న ఈ దేవాలయం సముద్ర మట్టానికి 2286 మీ. ఎత్తులో ఉన్నది.



ఉత్తరాఖండ్ లోని గ్రహ్వాల్ ప్రాంతంలో ఉన్న రుద్రనాథ్ ఆలయం  శివుని పంచ కేదార్ దేవాలయాలలో ఒకటి.పంచ  కేదార్ ఆలయాల క్రమాన్ని అనుసరిస్తే ఇది మూడవ ఆలయం.ఇక్కడ శివుని  "నీల్కాంత్ మహాదేవ" గా పూజిస్తారు.

చాలామంది భక్తులు  రుద్రనాథ్ ఆలయం దర్శించుకోవడం  అత్యంత కష్టతరమైనదిగా   భావిస్తారు. ఇది ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ యాత్రలో  ఒక భాగం.

చరిత్ర ఆధారంగా  పాండవులు రుద్రనాథ ఆలయాన్ని నిర్మించారు .మహాభారత సమయంలో పాండవులు కౌరవులను వదిస్తారు. ఆ పాపాన్ని పోగొట్టుకోవడనికి వ్యాస మహర్షి  శివుడి దర్శనం చేయమంటాడు.అయితే, శివుడు వారి నుండి దాక్కొని, ఒక ఎద్దు రూపాన్ని దరిస్తాడు.

అప్పుడు శివుడు గుప్తకాశీ లో ఒక భూగర్భ సురక్షిత ప్రాంతంలో అజ్ఞాతంలోకి వెళ్తాడు. ఆ తర్వాత, శివుడి శరీర భాగాలు ఎద్దు వలె ఐదు స్థానాలలో ఉంటాయి. అవే పాండవులు నిర్మించిన పంచ కేదార ఆలయాలు.రుద్రనాథ్ లో ముఖ భాగంలో శివుడు దర్శనమిస్తాడు.



రుద్రనాథ్ ఆలయం చుట్టూ  సూర్యకుండ్, చంద్ర కుండ్, తార కుండ్ మరియు మానస కుండ్ అనే  కొలనులు ఉన్నాయి. ఆలయం సమీపంలో నందా దేవి, త్రిశూల్ మరియు నందా ఘుంతి వంటి శిఖరాలు కూడా ఉన్నాయి.

ఆలయాన్ని దర్శించే  ముందు, భక్తులు నారద్ కుండ్ లో పుణ్య స్నానం చేస్తారు.అలాగే, పవిత్ర నది వైతరణి లేదా బైతరని లేదా రుద్రాగంగా ఆలయ సమీపంలో ప్రవహిస్తుంది. ఈ నది మోక్షానికి దారితీస్తుందని భక్తులు విశ్వసిస్తారు, అంతేకాదు, మరణించిన చివరి కర్మలను నిర్వహించడానికి వారు ఇక్కడకు వస్తారు.

ఆలయ వేళలు : 

ఉదయం 6  నుండి రాత్రి 7 వరకు

ఉదయం ఆరతి  - 6 గంటలకు 

సాయంత్రం ఆరతి  - 6.30 గంటలకు 

ముఖ్యమైన పండుగలు మరియు ఉత్సవాలు :

మహాశివరాత్రి 

డోలి యాత్ర 

శ్రవణమాసంలో పూర్ణిమ రోజున అంటే రక్షాబంధన్ రోజు జాతర లాగా నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారు.

రుద్రనాథ ఆలయం చేరుకోవడం ఎలా

వాయుమార్గం 

రుద్రప్రయాగ కు సమీప ఎయిర్ పోర్టు సుమారు 183 కి. మీ. ల దూరం లోని డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం. ఈ ఎయిర్ పోర్టు నుండి రుద్రప్రయగ్ కు టాక్సీ లు లభిస్తాయి. 

రైలు మార్గం
రుద్రప్రయాగ కు ఋషి కేష్ రైలు స్టేషన్ సమీపం. ఇక్కడకు కొన్ని రైళ్లు మాత్రమే వస్తాయి. అయితే 24 కి.మీ. ల దూరం లో కల హరిద్వార్ రైలు జంక్షన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు. 

రోడ్డు మార్గం 

రుద్రప్రయాగ నేషనల్ హై వే 58 మార్గం లో అంటే ఢిల్లీ నుండి బద్రీనాథ్ మార్గం లో కలదు. కనుక బస్సు సేవలు బాగా వుంటాయి. వేసవిలో న్యూఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్ళే బస్సు లు రుద్రప్రయాగ్ మీదుగానే వెళతాయి. రిషికేశ్ నుండి రుద్రప్రయాగ్ కు రెగ్యులర్ బస్సులు కలవు.

Post a Comment

0 Comments