Ad Code

Responsive Advertisement

గుడి / ఆలయానికి వెళ్లిన అప్పుడు ఎలా ఉండాలి ?




ఆలయంలోకి వెళ్లిన అప్పుడు పాటించవలసిన నియమాలు :

  • ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి.
  • సాంప్రదాయ దుస్తులు ధరించాలి.
  • గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.
  • మొదట స్వామివారి పాదాలు దరిశించి, తరువాత ముఖభాగం చూడాలి.
  • అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి.
  • తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని '' అకాల మృత్యు హరణం ...'' అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీస్కోవాలి.
  • దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.
  • ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.
  • ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు.
  • ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.
  • ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.
  • బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.
  • అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.
  • ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ
  • చేయాలి.
  • ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.
  • మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.

Post a Comment

0 Comments