Ad Code

Responsive Advertisement

ఐనవోలు మల్లన్న జాతర - వరంగల్, తెలంగాణ



  • తెలంగాణాలో ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న క్షేత్రం ఐనవోలు మల్లన్న ఆలయం.
  • ఇక్కడ గొల్లకేతమ్మ, బలిజె మేడలమ్మల సమేతంగా కొలువైన మల్లికార్జున స్వామి
  • కొలువైయున్నారు .
  • కాకతీయుల శిల్పకళాచాతుర్యం నుంచి స్వామికి జరిగే ఉత్సవాలవరకూ ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే. 
  • కాకతీయుల పరిపాలనలో అయ్యన్నదేవుడు మంత్రిగా ఉన్న కాలంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఆలయ శాసనాలు పేర్కొంటున్నాయి.
  • సంక్రాంతి పర్వదినం మొదలుకొని ఉగాది వరకూ మూడు నెలలపాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
  • మహాశివరాత్రి రోజున నృత్య మండపంలో వేసే పెద్దపట్నం, శివకల్యాణం, అయిదు రోజులపాటు సాగే అశ్వ, నంది, పర్వత, రావణ వాహన సేవలూ, చివరి రోజు రథోత్సవాలనూ ఈ క్షేత్రంలో వైభవంగా నిర్వహిస్తారు.
  • సంక్రాంతి రోజు ప్రారంభమయ్యే ఐనవోలు జాతరలో పెద్దబండి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
  • ఏటా సంక్రాంతి రోజున తిరిగే పెద్దబండిని చూడటానికి వేలసంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు.
  • వరంగల్‌ నగరానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయం. 

Post a Comment

0 Comments