Ad Code

Responsive Advertisement

అయ్యప్ప స్వామి - మకర జ్యోతి దర్శనం





  • జ్యోతి స్వరూపుడైన అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు మకర జ్యోతి రూపంలో దర్శినమిచ్చి భక్తులకు అపురూపమైన దివ్యానుభూతి ప్రసాదిస్తాడు.
  • దీనినే మకర విల్లుకు, జ్యోతిదర్శనంగా వ్యవహరిస్తారు.
  • ఈ జ్యోతి అయ్యప్ప స్వామి కొలువున్న ఆలయానికి ఎదురుగా ఉన్న కాంతిమలై కొండపై దర్శినమిస్తుంది.
  • మకర సంక్రాంతి సాయంత్రం పందళ రాజ వంశీకులు తెచ్చిన తిరువాభరణాలు స్వామికి అలంకరించిన తరువాతే జ్యోతి దర్శనం ఇస్తుంది.
  • పూర్వం మహిషి అనే రాక్షసి వధించి తమను రక్షించనందుకు కృతజ్ఞతలతో దేవతలు కాంతిమలై కొండ పై స్వర్ణలయంలో జ్ఞానపీఠం పై అయ్యప్పను కూర్చోబెట్టి నిత్యం పూజలు చేస్తున్నారు.
  • ఆ విధంగా సంధ్యాసమయంలో పూజ ముగించి దేవతలు ఇచ్చే సంధ్యాహారతే మనకు సంవత్సరానికి ఓ రోజు మకర జ్యోతిగా దర్శనమిస్తుంది అని అంటారు 

Post a Comment

0 Comments