Ad Code

Responsive Advertisement

దేవాలయమున చేయకూడని పనులు




👉 1. ఏదైనా వాహనమునెక్కి , పాదుకలను ధరించి ఆలయమునకు వెళ్ళుట .

👉 2. ఉత్సవము జరుగుచున్నచో సేవించక తిరిగి వచ్చుట.

👉 3. భగవంతునికి నమస్కరించకుండుట.

👉 4. ఒక చేతితో నమస్కరించుట.

👉 5. భగవంతుని ఎదుట ఆత్మ ప్రదక్షిణము చేయుట.

👉 6. ఎంగిలి చేతితో ఆశౌచముతో నమస్కరించుట.

👉 7. భగవంతుడికెదురుగా వీపుకు, మోకాళ్ళకు బట్ట చుట్టుకుని ఊగుచూ కూర్చుండుట.

👉 8. ఆలయములో భగవంతుని ఎదురుగా పడుకొనుట.

👉 9. భగవంతుని ఎదురు మండపములో విస్తరి పరుచుకుని భుజించుట.

👉 10. ఆలయమున లౌకిక విషయముల గురించి ఒకరితోనొకరు మాట్లాడుకొనుట.

👉 11. గట్టిగా అనవసర మాటలు మాట్లాడుట.

👉 12. లౌకిక విషయములపై ప్రసంగములు చేయుట.

👉 13. గట్టిగా ఏడ్చుట .

👉 14. ఒకరితోనొకరు పోట్లాడుట.

👉 15. నిగ్రహము కోల్పోయి పక్కవారిని బెదిరించటం వంటి దాష్టిక చేష్టలు చేయుట.

👉 16. ఒకరికి "నీకు ఈ ఉపకారము చేస్తాను", అని ప్రతిజ్ఞ చేయుట.

👉 17. స్త్రీలతో భావగర్భితముగా పరిహాసము ఆడుట.

👉18. ఆడరాని మాటలాడుట.

👉 19. అపాన వాయువు విడుచుట. (ఆ అవసరము వస్తే ముందుగానే బయటికి వెళ్ళాలి.)

👉 20. కంబళి - శాలువ మొదలగు వానితో శరీరమంతయు కప్పుకొనుట. (చలి అధికముగా ఉన్నచో  పై వస్త్రమును యజ్ఞోపవీతము వలే కప్పుకుని కుడిచేయి బయటకు ఉంచవలెను. )

👉 21. దైవ సన్నిధిలో ఇతరులను నిందించుట.

👉 22. ఇతరులను పొగుడుట.

👉 23. శక్తి ఉన్నా భగవంతునికి అల్పముగా సమర్పించుట.

👉 24. భగవంతునికి నైవేద్యం సమర్పించకుండా  ఆ పదార్థములు సన్నిధిలో కుర్చుని భుజించుట.

👉 25. ఆయా సమయాలలో తన ఇంటిలో గానీ తోటలో గానీ పండిన పండ్లను, కూరలను, పూచిన పూలను భగవంతునికి  సమర్పించకుండా తాను ఉపయోగించుకొనుట.

👉 26. తాను ఉపయోగించగా మిగిలిన పుష్పాలను, ఫలాలను పెరుమాళ్ళకు వినియోగించుట.

👉 27. భగవంతుడి వైపు  వీపు పెట్టి కూర్చొనుట.

👉 28. దైవ సన్నిధిలో ఎదుట ఇతరులకు నమస్కరించుట.

👉 29. తన ఆచార్యుల ప్రసంగము వచ్చినపుడు వారిని ప్రశంసిన్చకుండుట.   

👉 30. ఎట్టి సందర్భములలో అయినను తనను తాను పొగడుకొనుట.

👉 31. భగవంతుని నిందించుట.

👉 32. కాళ్ళు చాపుకుని కూర్చొనుట.

Post a Comment

0 Comments