Ad Code

Responsive Advertisement

పొలాల అమావాస్య




  • ఊరి పొలిమేరలో కొలువై జీవకోటిని కాపాడే తల్లి పోలేరు అమ్మ.
  • ఈ అమ్మకు ఏడాదికి ఒకసారి శ్రావణ బహుళ అమావాస్య నాడు పూజలు చేయడం ఆచారంగా వస్తుంది.
  • ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. 
  • ఈ పండుగకు కౌశ్య అమావాస్య, ఆలోక అమావాస్య, సప్తపురికా అమావాస్య, పోలాంబ వ్రతం అనే పేర్లు కూడా వున్నాయి.
  • భారతదేశంలోని ప్రతి ప్రాంతంలోనూ గ్రామా దేవతలను ఆరాధించే ఆచారం కనిపిస్తుంది.
  • గొప్ప తపస్సు చేసి బ్రహ్మ నుంచి వరాలు పొందిన అంధకాసురుడు అహంకారంతో విచక్షణ కోల్పోయి జగన్మాత అయిన పార్వతీదేవి కామించాడు. అప్పుడు దానవుడిని శివుడు సంహరిస్తాడు. ఆ సమయంలో తనకు సాయం చేసిన నందిని ఏదైనా వరం కోరుకోమన్నాడు శివుడు.
  • వృషభ రూపం లభించిన తనకు శ్రావణ బహుళ అమావాస్యనాడు పూజ చేసిన వాళ్లకు విశేష పుణ్యఫలం లభించాలి అని నంది కోరుకున్నాడు.అందుకే ఈ రోజు ఎద్దులను పూజిస్తారు.
  • సంతానం లేని వారికీ పోలేరుఅమ్మ సంతానం ఇస్తుంది, సంతానం కలిగిన వారికీ కడుపు చలవ చేస్తుంది అని స్త్రీలు విశ్వసిస్తారు.
  • ఈ అమ్మవారిని విశేషంగా పూజిస్తారు, తోరాలని పిల్లల మెడలో కడుతారు.
  • మహారాష్ట్రలో ఈ అమావాస్యను పిథోరి అమావాస్యగా పిలుస్తారు. 
2022 : ఆగష్టు 27.

Post a Comment

0 Comments