Ad Code

Responsive Advertisement

మౌని అమావాస్య



  • సూర్యుడు మకర సంక్రాతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తాడు. 
  • ఆ తరువాత వచ్చే పుష్యమాస అమావాస్యను ‘మౌని అమావాస్య’ అంటారు. 
  • ఆ రోజున పితృతర్పణాలూ, నదీ స్నానాలు చేయడం, మౌన వ్రతం పాటించడం (అంటే రోజంతా మాట్లాడకుండా ఉండడం) పుణ్యప్రదమన్నది శాస్త్రోక్తి. 
  • మౌని అమావాస్యనాడు గంగానది అమృతంగా మారుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
  •  ఆ రోజున వారణాసిలోని గంగానదిలో, అలహాబాద్‌ (ప్రయాగ)లోని త్రివేణీ సంగమంలో లక్షలాది ప్రజలు స్నానాలు ఆచరిస్తారు. 
  • గంగా స్నానానికి అవకాశం లేనివారు సమీపంలో ఉన్న నదిలో, ఇతర నీటి వనరుల్లో గంగా దేవిని తలచుకొని స్నానం చేసి, ఆపన్నులకు దానాలు చేయడం మంచిదన్నది పెద్దల మాట.


2020 : ఫిబ్రవరి, 11.

Post a Comment

0 Comments