Ad Code

Responsive Advertisement

మాఘస్నానం విశిష్టత



  • మాఘ స్నానాలకు సాటివచ్చే క్రతువులుగాని, క్రియలుకాని లేవని శాస్త్రాలు చెబుతున్నాయి.
  • ఈ పుణ్యస్నానం విశేషాలు బ్రహ్మపురాణంలోను, పద్మపురాణంలోను వివరించబడాయి.
  • పుష్యబహుళ అమావాస్య రోజున అంటే మాఘమాసం ప్రారంభమయే ముందురోజు ఆరంభించి, మాఘమాసం అంత నియమంగా ప్రతి రోజు చేయాలి.
  • అన్ని రోజులు వీలుకానప్పుడు మాఘశుద్ధ పాడ్యమి, విదియ, తదియలలో మూడురోజులు చేయవచ్చు.
  • మాఘ స్నానాలను పుణ్యనదులలో చేయడం విశేష ఫలదాయకం. అందుకు అవకాశం లేకపోతే చెరువుల వద్ద, బావుల వద్ద కనీసం బోరు బావుల దగ్గరైనా ఈ మాఘ స్నానాలు చేయవచ్చు.
  • ఈ స్నానాన్ని నక్షత్రాలు ఉండగా తెల్లవారుజామున చేయడం ఉత్తమం.
  • మాఘ స్నానాలు నూనె రాసుకొని చేయకూడదు అని శాస్త్రం స్పష్టంగా చెబుతోంది.
  • ఈ మాఘస్నానాలు చేయడం వల్ల కాయిక, వాచిక , మానసిక దోషాలు తొలగిపోతాయి. అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఆయురారోగ్యాలు చేకూరతాయి.

Post a Comment

0 Comments